రాజకీయాల్లోకి లాగొద్దంటూ సమంత వివరణ!
హైదరాబాద్: తనను అనవసరంగా రాజకీయాల్లోకి లొగ్దదని, తనకు రాజకీయాలపై అసలు ఆసక్తి లేదని, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరుపున ప్రచారం చేయడం లేదని హీరోయిన్ సమంత వివరణ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో సమంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేస్తుందనే వార్తలు వెలువడ్ నేపథ్యంలో ఆమె ఈ వివరణ ఇచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వారిలో కోన రఘుపతి ఒకరు. కోన రఘుపతి కూతురు కోన నీరజ సమంత పర్సనల్ డ్రెస్ డిజైనర్‌గా పని చేస్తోంది. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో కోన నీరజ సమంతను ప్రచారం చేయించడానికి ఒప్పించినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ రాజకీయ పార్టీలన్నీ సినిమా తారల వైపు తమ దృష్టి సారించాయి. వారితో ప్రచారం చేయిస్తే ఎంతో కొంత గెలుపు శాతం పెరిగే అవకాశం ఉండటంతో వీలైనంత మందిని రంగంలోకి దింపేందుకు తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు వివిధ పార్టీల్లో చేరి ఆయా పార్టీల తరుపున ప్రచారానికి సిద్ధమయ్యారు.
సమంత సినిమాల విసయానికొస్తే...ప్రస్తుతం ఆమె తెలుగులో నటించిన ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో పాటు వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తోంది. తమిళంలో అంజాన్, కత్తి అనే చిత్రాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











