Just In
- 12 min ago
బ్లాక్‌లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
- 1 hr ago
షూటింగ్‌కు సిద్ధమైన మహేశ్ డైరెక్టర్: ఆ తరహా కథతో ప్రయోగం చేయబోతున్నాడు
- 1 hr ago
ఆ డబ్బులేవో నువ్వే ఇవ్వొచ్చు కదా?.. యాంకర్ సుమ పోస్ట్‌పై నెటిజన్ల కామెంట్స్
- 1 hr ago
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
Don't Miss!
- Sports
క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒకే బంతికి ఒకే బ్యాట్స్‌మన్ రెండు సార్లు రనౌట్! వీడియో
- News
ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్‌కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటన
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సమంత క్రిస్ మస్ పార్టీ (ఫోటోస్)
హైదరాబాద్: రేపు క్రిస్ మస్ పండగను పురస్కరించుకుని తన సన్నిహితులు, స్నేహితులతో వేడుక జరుపుకునేందుకు సిద్ధమవుతోంది హీరోయిన్ సమంత. ఈ మేరకు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేసింది.
ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా, ఆనందంగా జీవించాలని సూచిస్తోంది. దీంతో పాటు హెల్దీ ఫుడ్ తీసుకుంటే అందంగా మెరిసిపోతారని సలహాలు ఇస్తోంది. ఒకరి గురించి చెడుగా ఆలోచించడం నాకు తెలియదు. వేరే హీరోయిన్ల ఆఫర్లు నాకు రావాలని ఎప్పుడూ కోరుకోను. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను. అదే నా ఆరోగ్య రహస్యం అంటోంది.

సినిమాల పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్న సమంత...ఇటు యాడ్ ఫిల్మ్స్ విషయంలోనూ అందరికంటే ముందు ఉంది. వీటి ద్వారా ప్రస్తుతం సౌత్ లో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోయిన్ కూడా ఆమె అని అంటున్నారు. సమంత కూడా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా చేస్తోంది. తాజాగా హీరోయిన్ సమంత కోకాకోలా కంపెనీ ఉత్పత్తి అయిన ‘మాజా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపకయింది. సౌత్ లో మాజా యాడ్ కు ఎంపికయిన తొలి హీరోయిన్ సమంతే కావడం విశేషం.
ఆమె సినిమాల విషయానికొస్తే.... సమంత సినిమాల విషయానికొస్తే... ఇటీవల ఆమె తమిళంలో కత్తి చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. విజయ్ హీరోగా నటించారు. తమిళంలో సమంతకు ఇదే ఇప్పటి వరకు తొలి మరియు అతి పెద్ద హిట్. ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

ప్రస్తుతం సమంత తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య, ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగు దశలో ఉంది.