twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Yashoda: సమంత యశోద సినిమాకు కోర్టు షాక్!.. అప్పటిదాకా ప్రసారం చేయొద్దని ఆర్డర్స్

    |

    టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు. ఆమె నటన, అభినయం, గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మొదట్లో గ్లామర్ రోల్స్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో పాత్రకు ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇక ఈ మధ్య ఎక్కువగా లేడి ఒరియెంటెడ్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ తన మార్క్ చాటుకుంటోంది. సామ్ ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సరోగసి నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాకు హైదరాబాద్ సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది.

    ట్రైలర్ తోనే పాజిటివ్ రియాక్షన్స్..

    ట్రైలర్ తోనే పాజిటివ్ రియాక్షన్స్..

    స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా నటించిన లేడి ఓరియెంటెడ్ మూవీ యశోద నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య 369 వంటి విభిన్నమైన సినిమాలను తెరపైకి తీసుకు వచ్చిన ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. టీజర్, ట్రైలర్ తోనే మంచి పాజిటివ్ రెస్పాన్స్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి హరి అండ్ హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

    వరల్డ్ వైడ్ గా అన్నికోట్లు..

    వరల్డ్ వైడ్ గా అన్నికోట్లు..

    యాక్షన్ సీక్వెన్స్ తో సమంత అదరగొట్టిన యశోద సినిమా మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ రాబట్టింది. పాజిటివ్ రివ్యూలతో పాటు పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకుంది. దీంతో కలెక్షన్స్ లో జోరు చూపించింది ఈ చిత్రం. యశోద సినిమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30.10 కోట్లు కొల్లగొట్టి దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాను థియేటర్లలో చూడలేనివారు ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడూ చూద్దామా అనే ఆసక్తితో ఉన్నారు.

    చివరిగా అమెజాన్ ప్రైమ్ కి..

    చివరిగా అమెజాన్ ప్రైమ్ కి..

    సరోగసి నేపథ్యంలో వచ్చిన యశోద మూవీ ఓటీటీ హక్కులను దక్కించుకునేందుకు ముందుగా కొన్ని ప్రముఖ సంస్థలు పోటీపడ్డాయి. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం మొదట హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ కూడా పోటీ పడ్డాయి. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కుల కోసం బాగానే ఆఫర్ చేసినట్లు ఆమధ్య టాక్ అయితే వచ్చింది. ఇక ఫైనల్ గా యశోద సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కు రూ. 25 కోట్లకు నిర్మాత విక్రయించినట్లు తెలిసిన విషయమే.

    డిసెంబర్ 19 వరకు నిలిపివేత..

    డిసెంబర్ 19 వరకు నిలిపివేత..

    డిసెంబర్ రెండో వారంలో తమ ఓటీటీ వేదికపై యశోద సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. అయితే ఇప్పుడు తాజాగా యశోద దర్శకనిర్మాతలకు ఊహించని షాక్ తగిలింది. యశోద సినిమా ఓటీటీ రిలీజ్ ను నిలిపివేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు సమంత యశోద చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.

    ప్రతిష్ట దెబ్బతీసిందంటూ..

    ప్రతిష్ట దెబ్బతీసిందంటూ..

    అయితే యశోద చిత్రాన్ని సరోగసి ఫెర్టిలిటీ సెంటర్లలో జరిగే అక్రమాలను బేస్ చేసుకుని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈ ఫెర్టిలిటీ సెంటర్ కు ఈవా అని పేరు పెట్టారు. సినిమాలో తమ ఆస్పత్రి పేరు పెట్టడంతో తమ హాస్పిటల్ ప్రతిష్టను దెబ్బతీసిందంటూ ఈవా హాస్పిటల్ మేనేజ్ మెంట్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఈవా సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

    స్పందించని సమంత..

    స్పందించని సమంత..

    డిసెంబర్ 19 వరకు ఓటీటీలో యశోద సినిమాను విడుదల చేయకూడదని మూవీ నిర్మాణ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణను కూడా డిసెంబర్ 19కి వాయిదా వేసింది. అయితే కోర్టు తీర్పుపై యశోద చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. హీరోయిన్ సమంత కూడా ఏ విధంగానూ స్పందించలేదు. కోర్టు విధించిన గడువులోపు ఆస్పత్రి యాజమాన్యంతో యశోద దర్శకనిర్మాతలు చర్చలు జరిపి ఏదైనా నిర్ణయం తీసుకుంటారో అనేది వేచి చూడాలి.

    English summary
    Hyderabad City Civil Court Orders To Stop Samantha Yashoda Movie Streaming In OTT Until December 19.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X