చిరంజీవికి డా.సమరం వెల్కమ్!!!
చిరంజీవి కచ్చితంగా రాజకీయ సమరభేరి మోగిస్తారని ప్రముఖ సెక్సాలజిస్ట్ జి.సమరం అభిప్రాయపడ్డారు. గురువారంనాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆయన మాటలలోనే....చిరంజీవి కచ్చితంగా రాజకీయాలలోకి వస్తారు. ఆయన రావాల్సిన అవసరం ఉంది. చిరంజీవి రాజకీయాలలోకి వస్తే అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతుంది. చిరంజీవి చాలా మంచి వ్యక్తి. అంతమంచి వ్యక్తిత్వం మూర్తిభవించిన చిరంజీవి రాజకీయాలలోకి వస్తే మంచి జరుగుతుంది. ఇపుడున్న రాజకీయ పార్టీలు చేసేదేమీలేదు..చిరంజీవి కనుక రాజకీయాలలోకి వస్తే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లతోనే కాకుండా ఎయిడ్స్ వ్యతిరేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ సమాజాన్ని చైతన్య పరుస్తున్నారు. అలాంటి వ్యక్తి వస్తే మంచే జరుగుతుంది. ఆయన తన పార్టీని చిరంజీవి పార్టీగా పేరు పెడితే చాలా బాగుంటుంది....అన్నారు సమరం.


Click it and Unblock the Notifications











