Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెబల్ స్టార్ ‘సమర్థుడు’ రేపే విడుదల
కృష్ణంరాజు ప్రధాన పాత్రధారిగా, రాజా, సంజన జంటగా దేవిక ప్రొడక్షన్స్, ఆరెంజ్ ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'సమర్థుడు" చిత్రం విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ఆకుల సురేష్, ఎం. వెంకట్రామిరెడ్డి చెప్పారు. అర్జున్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి నరహరి వినయ్ రెడ్డి సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. 'ఈ చిత్రంలో కృష్ణంరాజు, రాజాల పాత్రలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఓ సమర్ధుడైన రాజకీయ నాయకుడికీ, ఓ తెలివైన హంతకుడికీ మధ్య జరిగిన సంఘర్షణ చుట్టూ తిరిగే చిత్రం 'సమర్థుడు". క్రిమినల్ గా ఒక యాక్షన్ పాత్రలో రాజా కనిపించబోతున్నారు" అని వారు చెప్పారు. కృష్ణంరాజు మాట్లాడుతూ 'ఈ చిత్రంలో నేను ఒక రాజకీయ నాయకుడి పాత్రను పోషించాను. ఈ పాత్రను నేనే చెయ్యగలనని దర్శక నిర్మాతలు పట్టుబట్టడంతో దీన్ని చేశాను. ప్రేమ, సెంటిమెంట్, వినోదం అన్ని ఉన్ని ఉన్న ఈ చిత్రంను తప్పకుండా ఇది ప్రజాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది అన్నారు వినోద్ కుమార్, జీవా, సలీమ్ పండా, జీవా ఇతర ప్రధాన పాత్రధారులైన ఈ సినిమాకి వల్లూరి రాజశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.