కర్నూలులో ‘శంభో..శివశంభో’
బెల్లంకొండ పద్మావతి సమర్పణలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.సముధిరకణి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'శంభో...శివశంభో" చిత్రం షూటింగ్ కర్నూలులో జరుగుతోంది. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ హీరోలుగా ప్రియమణి కాథానాయికగా నటిస్తున్నారు. తమిళంలో రూపొంది ఘనవిజయం సాధించిన 'నాడోడిగళ్" చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ' ఈ నెల 16 నుంచి 20 వరకు హైదరాబాద్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేసి 21 నుంచి కర్నూలులో షూటింగ్ ప్రారంభించాం. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అనంతరం అహూబిలంలో మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నామని తెలియజేశారు.
సముధిరకణిని ఈ చిత్రం ద్వారా తెలుగులో పరిచయం చేస్తున్నాం. స్నేహం తాలూకు ఔన్నత్యాన్ని తెలియజేసే విధంగా ఈ సినిమా వుంటుందన్నారు. మిగిలిన పాత్రల్లో సునీల్, రోజా, కృష్ణభగవాన్, కృష్ణుడు, ముఖేష్ రిషి, రాజా రవీంద్ర, ఆహుతి ప్రసాద్, జీవా, సుధ, కిన్నెర, చిత్రలేఖ, రాధాకుమారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సుందర్ సి.బాబు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











