నా కెరీర్ లో ఉత్తమ చిత్రం: రవితేజ
సంక్రాంతినాడు విడుదలై దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న 'శంభో శివ శంభో' చిత్రం తనకు పునర్జన్మనిచ్చిందని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు. చాలా సంవత్సరాలు తర్వాత మనస్ఫూర్తిగా ఎంజారు చేస్తున్నానని పేర్కొన్నారు. మంచి సినిమా తీశావని చాలామంది అభినందిస్తుంటే చెప్పలేని ఆనందానికి గురయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుకు 2లక్షల రూపాయల చెక్‌ను ఆయన అందజేశారు.
రవితేజ, ప్రియమణి, నరేష్, శివబాలాజీ, అభినయ నటించిన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు సముద్రఖణి దర్శకత్వం వహించారు. సోమవారంనాడు ఫిలిం ఛాంబర్ లో సక్సెస్‌మీట్ జరిగింది.రవితేజ మాట్లాడుతూ...'నా కెరీర్‌లో ఉత్తమ చిత్రమిది. అంతకుముందు 'నా ఆటోగ్రాఫ్'ను సురేష్‌గారే నిర్మించారు. మళ్ళీ ఈ చిత్రమూ మంచి పేరు తెచ్చింది' అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...'రవితేజ ఇమేజ్‌ను 10 నిముషాల్లో మర్చిపోయేట్లు కథను రాసుకుని తెరకెక్కించా. నటన పట్ల తపన ఉన్నవాడు కాబట్టే ఇలాంటి చిత్రంలో చేశాడు' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











