వాళ్ళిద్దరికి అచ్చొచ్చిన అందాల బొమ్మాళీ అనుష్క...
తన కోసం బికినీ వేసుకుని మరీ వచ్చిన అనుష్కని చూసి 'బొమ్మాళీ బొమ్మాళీ" అంటూ పాట పాడేసిన రెబల్ స్టార్ ప్రభాస్, ఇప్పుడు మరోసారి తన జోడిగా అనుష్కని ఎంచుకున్నాడు. అసలు విషయం ఏటంటే..లారెన్స్ డైరెక్టర్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ చెయ్యనున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అనుష్క హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. జె. భగవాన్-జె. పుల్లారావులు శ్రీ బాలజీ సినీ మీడియా బేనర్ పై నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్ట్ లో ప్రారంభమై సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
హిందీలో షారుఖ్ చేసిన 'డాన్" చిత్రం తమిళ్ లో, తెలుగులో 'బిల్లా" పేరుతో రాగా, టాలీవుడ్ 'బిల్లా" ప్రభాస్ సరసన కథానాయికగా చేసిన అనుష్క, నాగ్ హీరోగా 'డాన్" పేరుతో లారెన్స్ చేసిన సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఇప్పుడు 'బిల్లా" హీరో ప్రభాస్-డాన్ డైరెక్టర్ లారెన్స్ ఇద్దరూ కలిసి తమకు అచ్చొచ్చిన 'అరుంధతి"ని మరోసారి హీరోయిన్ గా కోరుకున్నారన్నమాట..!


Click it and Unblock the Notifications











