ఆమె చేసిన కామెంట్లకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన హీరో నాని!
Recommended Video

బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ నాని హోస్ట్‌గా ప్రారంభం అయిన తర్వాత రకరకాల కామెంట్స్ వినిపించాయి. మొదటి సీజన్ హోస్ట్ ఎన్టీఆర్‌తో నానిని కంపేర్ చేస్తూ కొందరు విమర్శలు చేయడం ప్రారంభించారు. యంగ్ టైగర్ స్థాయిలో నేచురల్ స్టార్ అలరించడం లేదనే వ్యాఖ్యలు సైతం వినిపించాయి. ఈ నేపథ్యంలో తొలి వారం బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన మిస్ హైదరాబాద్ సంజన ఈ రియాల్టీ షో జరుగుతున్న తీరు, ఎలిమినేషన్ ప్రోసీజర్, హౌస్‌లో పోటీదారుల ప్రవర్తనపై ఆమె ఘాటైన కామెంట్స్ చేశారు. షో హోస్ట్ నాని మీద కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా. దీనికి నాని గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఎన్టీఆర్ ఐఫోన్, నాని మామూలు ఫోన్
బిగ్ బాస్ రెండు సీజన్లతో పోలిస్తే ఎవరి హోస్టింగ్ బాగా నచ్చింది అనే ప్రశ్నపై సంజన స్పందిస్తూ.... ఎన్టీఆర్ అని సమాధానం ఇచ్చారు. నాని హోస్టింగ్ బాగోలేదని చెప్పలేను కానీ.... ఐఫోన్ వాడే వారికి నార్మల్ ఫోన్ ఎలా ఎక్కదో, ఎన్టీఆర్‌ను చూశాక నాకు నాని ఎక్కలేదు అని ఆమె వ్యాఖ్యానించారు.
దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన నాని
సంజన కామెంట్లపై నాని తనదైన రీతిలో రియాక్ట్ అయ్యారు. ‘సేమ్ పించ్... ఐ లైక్ ఐ ఫోన్ టూ' అంటూ ట్వీట్ చేశారు. నాని ఈ కామెంట్స్ చేయడం ద్వారా సంజనకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారని అభిమానులు చర్చించుకుంటున్నారు.

మొదటి రోజు నుండే సంజన అసంతృప్తి
బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టిన మొదటి రోజు నుండే సంజన అసంతృప్తిగా ఉన్నారు. తాను ఏ తప్పూ చేయకున్నా సెలబ్రిటీలంతా కలిసి తనను జైల్లో పెట్టించారని, రెండు రోజులు హౌస్‌లో నన్ను నేరం చేసిన వ్యక్తిలా బందీగా ఉంచారని ఆమె వాపోయారు.

ఎలిమినేషన్ వెనక పాలిటిక్స్
బిగ్ బాస్ షో నుండి తనను ఎలిమినేట్ చేయడం వెనక చాలా పాలిటిక్స్ జరిగాయని, తనకు ప్రేక్షకులను నుండి మంచి సపోర్ట్ వచ్చినా కావాలనే బయటకు పంపించారని, తనకంటే తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఇంట్లో ఉంచారని సంజన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అవేవీ చూపించలేదు
బిగ్ బాస్ ఇంట్లో తన పట్ల ఇంటి సభ్యులు చాలా దారుణంగా ప్రవర్తించారని, అవేవీ ప్రేక్షకులకు చూపించలేదని సంజన వాపోయారు. సెలబ్రిటీలంతా కలిసి తన లాంటి సామాన్యులను బలిచేస్తున్నారని, వారెవరూ గేమ్ ఫెయిర్‌గా ఆడటం లేదని సంజన అసంతృప్తి వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











