నిర్మాతగా మారనున్న సమీరారెడ్డి

అయితే ఒక బాలీవుడ్ సినిమా నిర్మించడానికి అవసరమైనంత డబ్బు ఆమె వద్ద ఉందా అన్న ప్రశ్న తలెత్త వచ్చు. రాజమండ్రికి చెందిన సమీరారెడ్డి తండ్రి కొన్ని దశాబ్దాల క్రితమే బొంబాయి వెళ్ళి, అనేక వ్యాపారాల్లో విజయవంతమై కోట్లాది రూపాయలు సంపాదించారు. సమీరా కూడా తక్కువ తిన లేదు. ఆమె హీరోయిన్ గా సంపాదించిన డబ్బును తండ్రి సలహా మీద రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది.
తన చెల్లెలు సినిమా నిర్మాణ రంగంలోకి వెళ్దామని సలహా ఇవ్వగా సమీరా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే గాక తండ్రి గారి ఆమోదం కూడా పొందిందట.


Click it and Unblock the Notifications











