ఇక్కడి ఐరన్ లెగ్ సమీర అక్కడ ఊపేస్తోంది

By Bojja Kumar

జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ లవర్..సమీరరెడ్డి ఆ మధ్య రెండుమూడు తెలుగు సినిమాల్లో తలుక్కమన్నా రాణించ లేక పోయింది. కారణం ఆమె నటించిన సినిమాలన్నీ పరమ ప్లాపులుగా నిలవడమే దీంతో సమీరా రెడ్డిపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. దీంతో టాలీవుడ్‌లో అసలు అవకాశాలే లేకుండా పోయాయి సమీరాకి. అయితే ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే...తమిళనాడు లో సమీరా బాగానే రాణిస్తుంది. బొద్దుగుమ్మలంటే తెగ ఇష్టపడే తమిళ తంబీలకు సమీరా తెగ నచ్చేసింది.

ప్రస్తుతం సమీరా రెండు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండగా, మరో మూడు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం సమీరా లాంటి పర్సనాలిటీ, అందం ఉన్న హీరోయిన్లు అక్కడ చాలా కొతరగా ఉండటం సమీరాకు బాగా కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇదే అదునుగా టాలీవుడ్ లో తనపై పడ్డ ఐరన్ లెగ్ ముద్రను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందట సమీరా. ఈ మేరకు తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఓ మంచి హిట్ సాధించి తనది ఇనుప కాలు అనే అపవాదును తుడుచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X