సమీరా రెడ్డితో బాబాయ్, అబ్బాయి హాట్ హాట్ గా... (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: హీరోయిన్స్.. ఐటం గర్ల్ గా మారి డాన్స్ చేస్తే తెరపై ఓ రేంజి రెస్పాన్స్ వస్తుంది. అదే ట్రిక్కుని రాణా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'లో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంలో సమీరా రెడ్డి ప్రత్యేక నృత్యం చేస్తోంది. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు.
కృష్ణం వందే జగద్గురంలో చేయటం ద్వారా సమీరా మళ్లీ తాను తెలుగులోకి రావాలనే ఆసక్తిని కనపరిచినట్లైంది. అప్పట్లో మెగా స్టార్ తో జై చిరంజీవ, ఎన్టీఆర్ తో అశోక్, నరసింహుడు వంటివి చేసినా అవి ఆడకపోవటంతో తప్పనిసరి పరిస్దితుల్లో తెలుగు నుంచి వైదొలగాల్సివచ్చింది. అయితే ఈ చిత్రంలో ఆమె అందచందాలు చూసిన వారు మళ్లీ ఆమెకు తెలుగులో ఆఫర్స్ ఇస్తారని భావిస్తోంది. త్వరలోనే మరో తెలుగు చిత్రంలో పెద్ద హీరో సరసన కనపడుతుందని వినపడుతోంది.

జూ.ఎన్టీఆర్ తో నరసింహుడు, అశోక్ చిత్రాలలో చేసిన సమీరా రెడ్డి గుర్తుండే ఉంటుంది. ఆమె ఇప్పుడు ఐటం గర్ల్ గా మారింది.

వెంకటేష్, సమీరా రెడ్డిల కాంబినేషన్ లో చిత్రం రాలేదు కానీ, ఈ చిత్రంలో ఇద్దరూ కలిసి డాన్స్ చేయటం ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

రాణా కూడా సమీరా రెడ్డితో కాలు కదిపారు.. ఆ స్టెప్ లకు లకు మంచి రెస్పాన్స్ వస్తుందని యూనిట్ అంటోంది.

రాణా, వెంకటేష్ కలిసి ఒకేసారి తెరపై కనపడటం ఒక ఎత్తు అయితే, మధ్యలో సమీరా రెడ్డి ఉండటం మరో కిక్కు.

'కృష్ణం వందే జగద్గురుమ్' దర్శకుడు మాట్లాడుతూ ''సురభి నాటక బృందంతో ఉండే బాబు అనే యువకుడి ఆలోచనల చుట్టూ కథ నడుస్తుంది. అతని భావజాలం ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటుంది ''అన్నారు.

"ఒక మంచి స్క్రిప్ట్ నమ్మి గమ్యం చేశాను. మళ్ళీ అదే టీమ్‌తో ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా వుంది. ఖైదీ సినిమా చిరంజీవి గారికి ఎలా అయితే టర్నింగ్ పాయింట్ అయిందో, ఈ సినిమా రాణాకు, నాకూ అలాంటి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇది యాక్షన్ అడ్వెంచర్ మూవీ" అని అన్నారు.

''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్ బాబు మాస్ అయితే దేవిక క్లాస్. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రాణా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది.


Click it and Unblock the Notifications











