ఎన్టీఆర్ హీరోయిన్...రానా కి ఐటం గర్ల్
హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్ తో నరసింహుడు,అశోక్ చిత్రాలలో చేసిన సమీరా రెడ్డి గుర్తుండే ఉంటుంది. ఆమె ఇప్పుడు ఐటం గర్ల్ గా మారింది. రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'లో ఆమె ప్రత్యేక నృత్యం చేస్తోంది. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఐటం సాంగ్ మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే రానా, సమీరాలపై ఆ పాటను చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబరు 3న ఈ చిత్రంలో గీతాల్ని ఆవిష్కరిస్తారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు.
సురభి నాటక కుటుంబం నుంచి వచ్చిన బీటెక్ బాబు చుట్టూ కథ నడుస్తుంది. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. దగ్గుబాటి రానా హీరోగా, క్రిష్ దర్శకత్వంలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. దర్శకుడు మాట్లాడుతూ ''సురభి నాటక బృందంతో ఉండే బాబు అనే యువకుడి ఆలోచనల చుట్టూ కథ నడుస్తుంది. అతని భావజాలం ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటుంది. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది''అన్నారు.
"ఒక మంచి స్క్రిప్ట్ నమ్మి గమ్యం చేశాను. మళ్ళీ అదే టీమ్‌తో ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా వుంది. ఖైదీ సినిమా చిరంజీవి గారికి ఎలా అయితే టర్నింగ్ పాయింట్ అయిందో, ఈ సినిమా రానాకు, నాకూ అలాంటి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సినిమా కథ ఐడియా జస్ట్ రెండు నిమిషాల్లో వచ్చింది. వెంటనే రానాకు ఫోన్ చేసి చెప్పాను. అతను మాత్రమే ఈ కథకు సూట్ అవుతాడు. గమ్యం, వేదంలలో గాలి శీను, కేబుల్ రాజును చూపించిన విధంగానే ఇందులో రానాని బీటెక్ బాబుగా చూపిస్తున్నాను. ఇది యాక్షన్ అడ్వెంచర్ మూవీ" అని అన్నారు.
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్ బాబు మాస్ అయితే దేవిక క్లాస్. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.


Click it and Unblock the Notifications











