సమీరా రెడ్డికి పెద్ద బొక్క పెట్టిన హ్యాకర్లు
బాలీవుడ్ హీరోయిన్ సమీర రెడ్డి క్రెడిట్ కార్డు హ్యాక్ అయింది. గతవారం ఈ హ్యాకింగ్ జరిగినట్లు గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమైంది ఈ హాట్ బ్యూటీ. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...''గత వారం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించనికి వీలు లేకుండా ఉంది. నానుంచి కొన్ని వ్యక్తిగత వివరాలు రాబట్టారు. ఆ తర్వాత తెలిసింది తన క్రెడిట్ కార్డు హ్యాంక్ అయిందని, వెంటనే నేను నా క్రెడిట్ కార్డు అకౌంట్ కాన్సిల్ చేయమని బ్యాంకు వారికి ఫోన్ చేశాను. కానీ అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 32 ట్రాంజాక్సన్స్ జరిగాయి. వేల డాలర్లు నొక్కేశారు""...అంటూ బోరుమంది సమీర.
కాగా...హిందీలో పెద్దగా అవకాశాలు లేక పోవడంతో సమీర ఇప్పుడు సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీపై తన దృష్టి సారించింది. ఇప్పటికే పలు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అపజయాల్లో మన పక్కన వుండటానికి బాలీవుడ్ లో ఎవరూ ఇష్టపడరు" అంటూ విమర్శలు గుప్పిస్తూ.... దక్షిణాది వారికి కొంచెం భక్తి ఎక్కువ. ఎవరైనా నచ్చారంటే వారికోసం ఎలాంటి త్యాగానికైనా సిధ్ధపడుతారు" అని ఇక్కడి వారిని తన బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది సమీర.


Click it and Unblock the Notifications











