twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమీరారెడ్డికి నచ్చే తెలుగు హీరో

    By Staff
    |

    Sameera Reddy
    అశోక్ టైమ్ లో ఎన్టీఆర్, సమీరారెడ్డి ప్రేమలో మునిగితేలినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అవి వచ్చినంత వేగంగా తగ్గిపోయాయి. అనంతరం ఆమె చిరంజీవితో జై చిరంజీవ చిత్రం చేసింది. ఇక్కడ వర్కవుట్ కాక మళ్ళీ భాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అయితే మొన్నీ మధ్యన సూర్యతో ఓ సినిమాలో నటించి అందరికి తానున్నట్లు గుర్తు చేసింది. వీటిన్నటినీ దృష్టిలో పెట్టుకుని ఓ మీడియా వ్యక్తి తాజాగా ఆమెను మీ అబిమాన హీరో ఎవరూ అని అడిగారు.

    ఆమె దానికి సమాధానంగా ఓ తెలుగు హీరో అని చెప్పింది. ఎవరూ అని రెట్టించే సరికి కాస్సేపు తచ్చాడి నాగార్జున అంది. అంతేగాక అతనితో నటించే ఆఫర్ వస్తే థ్రిల్లింగా ఉంటుందని చెప్పింది. ఇది నాగార్జున కి చేరిందో లేదో కానీ అడిగిన వాడికి షాక్ ఇచ్చింది. వాళ్ళు ఏ ఎన్టీఆర్ అంటుందో అనుకుని ప్రిపేర్ అయితే ఇట్లా ట్విస్ట్ ఇచ్చిందేమిటి అని షాక్ అయ్యారు. ఇంతకీ సమీరా ఇక్కడ తెలుగు అమ్మాయే. ప్రస్తుతం హైదరాబాద్ లో నే ఉందని సమాచారం. కొద్ది మంది హీరోలను దర్శకులను తనకున్న పరిచయాలతో కలుస్తూ అవకాశాలు అడుగుతోందన తెలుస్తోంది. అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X