twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే పెళ్లి విషయంలో సమీరా తొందరపడిందట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హీరోయిన్ సమీరా రెడ్డి ఇటీవల తన ప్రియుడు అక్షయ్ వర్దేను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వీరి వివాహం ఏప్రిల్ నెలలో జరుగాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఆగమేఘాల మీద, అందరినీ పిలవకుండా, మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా క్లోజ్ ఫ్రెండ్స్‌ను మాత్రమే ఆహ్వానించి.....సింపుల్‌గా, హడావుడిగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మీడియాకు పోటోలు విడుదల చేసారు.

    ఇటీవల మీడియా కంట పడ్డ సమీరా రెడ్డి....తాను ఇలా ఆగమేఘాల మీద పెళ్లి చేసుకోవడానికి కారణం వివరించింది. తన సోదరి వెకేషన్ మీద ఇండియా వచ్చిందని, తిరిగి యూఎస్ వెళ్లి పోతుంది. ఆమె మళ్లీ ఏప్రిల్ నెలలో తిరిగి వచ్చే పరిస్థితి లేక పోవడం వల్లనే ఇంత హడావుడిగా పెళ్లి చేసుకున్నామని తెలిపింది. అందుకే ఈ వివాహానికి ఎవరినీ ఆహ్వానించే అవకాశం లేకుండా పోయిందని తెలిపింది. సింపుల్ గా జరిగినా....చాలా హ్యాపీగా పెళ్లి చేసుకున్నామని వెల్లడించింది.

    ఈ నెల 21వ తేదీ సాయంత్రం వ్యాపార వేత్త అక్షయ్ వర్దేను ముంబయ్ లోని బాంద్రాలో సమీరా పెళ్లాడింది. వీరి వివాహ కార్యక్రమానికి కేవలం సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. స్పెషల్ డిజైన్డ్ మోటార్ బైక్స్ తయారు చేసే వ్యాపారాన్ని నిర్వహించే అక్షయ్ వర్దేతో సమీరా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే

    సమీరా, అక్షయ్‌ల నిశ్చితార్థం డిసెంబర్‌లో జరిగింది. వర్దేంచి పేరుతో అక్షయ్ తయారు చేసే మోటార్ బైక్స్ ను సమీరా ఇష్టంగా వినియోగించేది. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి మోటార్ బైక్ కారణమని సమీరా స్నేహితురాలు తెలిపింది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'ఓ మై గాడ్' చిత్రం కోసం వీరి సంస్థ ప్రత్యేకంగా బైకును డిజైన్ చేసింది.

    English summary
    Sameera reddy finally reveals reason behind her sudden marriage decision, She said that "we planned to marry in April and also planned to invite everyone to our marriage. But my sister who stays in USA returned back India for vacation and she can not come back again on April for our marriage."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X