పెళ్లి చేసుకోబోతున్న సమీరారెడ్డి
హీరోయిన్ సమీరారెడ్డి పెళ్లి చేసుకోబోతోంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను ఆమె వివాహమాడనుంది. ఇటీవల సమీరా పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 14న వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. 2014లో వీరి వివాహం జరుగనుంది.
పెళ్లి ముహూర్తం ఖరారైన తర్వాత వెడ్డింగ్ డేట్ ప్రకటించనున్నారు. అక్షయ్ వర్దే ముంబైలో కస్టమ్ మేడ్ మోటారు బైకులకు సంబంధించిన బిజినెస్ ఉంది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'ఓ మై గాడ్' చిత్రం కోసం వీరి సంస్థ ప్రత్యేకంగా బైకును డిజైన్ చేసింది.

సమీరారెడ్డి మన తెలుగమ్మాయే. రాజమండ్రిలో జన్మించింది. ఆమె తండ్రిపేరు సి.పి.రెడ్డి. సమీరా చిన్నతనంలోనే వీరి ఫ్యామిలీ ముంబైకి షిప్టయింది. ముంబైలోనే పెరిగిన సమీరా మోడలింగ్ రంగంలో ప్రవేశించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
స్టార్ హీరోయిన్ రేంజికి ఎదగక పోయినా బాలీవుడ్ సినిమాలతో పాటు ఇటు దక్షిణాది సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది సమీరారెడ్డి. సమీరా రెడ్డి అన్ని సినీ పరిశ్రమల వారికి సుపరిచితమే. తెలుగు కుటుంబానికి చెందిన సమీరా....బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు, తమిళం ఇతర దక్షిణాది సినిమాల్లోనూ నటించింది.


Click it and Unblock the Notifications











