సెక్సీ సమీరారెడ్డికీ, నక్సలైట్స్ కీ సంభందం ఏంటి?

By Srikanya

ఎన్టీఆర్ సరసన అశోక్,నరసింహ చిత్రాలు, చిరంజీవితో జై చిరంజీవ చేసిన సమీరా రెడ్డి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడామె తప్పని సరి పరిస్ధితుల్లో నక్సలైట్ గా మారిన పాత్రలో కనిపించనుంది. ఆ సినిమా పేరు 'రెడ్ అలర్ట్- ది వార్ విత్ ఇన్'. జూలై 16న విడుదల కానున్న ఈ సినిమాను దక్షిణ భారతీయ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. అలాగే ఈ చిత్రంలో ఆంధ్రా పేద రైతుగా సునీల్ శెట్టి కనిపిస్తారు. అతని చుట్టూనే కథ తిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ లో ఓ మారుమూల గ్రామంలో జరిగిన ఓ యధార్థ ఘటన ఆధారంగా ఈ ఇతివృత్తాన్ని తెరకెక్కిస్తున్నారు.

కథ ప్రకారం...కుటుంబాన్ని పోషించలేని కడు పేదరికంతో గత్యంతరం లేక నరసింహ అనే రైతు కూలీ నక్సలైట్‌గా మారుతాడు. మావోయిస్టుల వద్ద వంటవాడిగా చేరి కొద్ది రోజుల్లోనే ఆయుధాలతో పోరాటమూ చేస్తాడు. పైస్థాయి నేతలతో సైద్ధాంతికంగా ఘర్షణకూ దిగుతాడు. ఓవైపు చట్టాలు.. మరోవైపు హింస, సాయుధ పోరాటం. అంతర్మధనం జరిగి ఆత్మసంఘర్షణ తారస్థాయికి చేరుతుంది. ఆ క్రమంలో అతనికి సమరా రెడ్డి పరిచయం అవుతుంది. నసీరుద్దీన్ షా, సీమా బిశ్వాస్ వంటి విలక్షణ నటులు కీలకపాత్రలు చేసిన ఈ చిత్రం అనంత మహదేవన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X