జై చిరంజీవ,నరసింహుడు,అశోక్ సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సెక్సీ హీరోయిన్ సమీరా రెడ్డి. ఆమె బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా వర్కవుట్ కాకపోవటం,పోనీ తెలుగులో సెటిల్ అవుదామనుకున్నా అవకాశాలు రాకపోవటం ఆమెను ఆలోచనలలో పడేస్తున్నాయి. అందులోనూ ఆమె తాజాగా సూర్య హీరోగా తమిళంలో భారీగా రూపొందుతున్న Vaaranam Aayiram లో హీరోయిన్ గా చేస్తున్నా ఇప్పటికీ ఆమెకు కొత్త ఆఫర్స్ రావటం లేదుట. దాంతో ఆమె చివరకు తన సినిమాలు పెద్ద హిట్స్ నమోదు చెయ్యకపోవటానికి కారణాలు తెలిసాయని,అయితే ఎవరినీ బ్లేమ్ చేసేది లేదని,తనకు నచ్చిన విధంగా సినిమాలు తీసుకోవటానికి నిర్ణయం తీసుకున్నాయని ఆమె చెప్తోంది. అందుకోసం ఆమె ఇప్పటికే కొన్ని స్క్రిప్టు లు విని ప్రాజెక్టు రిపోర్టులు తయారుచేయమని సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్స్ కి అప్పచెప్పిందిట.మీనింగ్ ఫుల్ సినిమాలు తీస్తానని చెప్తోంది. నిర్మాతగా అయినా ఆమె సక్సెస్ కావాలని కోరుకుందా...ఇంతకీ ఆమె తీయబోయే సినిమా తెలుగా...హిందీనా...తమిళమా...