102 కేజీల బరువుతో డిప్రెషన్‌లోకి .. ఎలాంటి కామెంట్స్ చేశారో తెలుసా.. క్రేజీ హీరోయిన్!

హీరోయిన్ సమీరా రెడ్డి అందరికి గుర్తుండే ఉంటుంది. అందం, అభినయం అన్ని కలబోసిన నటి సమీరా రెడ్డి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి అలరించింది. కుర్రకారు సమీరారెడ్డి అందాలకు ఫిదా అయ్యేవారు. ఆమె తెలుగులో నటించిన చిత్రాలు విజయం సాధించలేదు. కానీ సమీరా రెడ్డికి మాత్రం మంచి క్రేజ్ ఉంది. సమీరా రెడ్డి అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఇటీవల సమీరా రెడ్డి రెండవసారి గర్భవతి అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమీరా రెడ్డి నిండు గర్భంతో ఉంది. తాజాగా సమీరా రెడ్డి తాను తొలిసారి గర్భవతి అయినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానో వివరించింది.

నేనొకటి అనుకుంటే

నేనొకటి అనుకుంటే

సమీరా రెడ్డి మాట్లాడుతూ.. వివాహం జరిగిన కొన్ని నెలలకే గర్భవతిని అయ్యా. డెలివరీ అయ్యాక తల్లిగా భాద్యతలు ఎలా నిర్వర్తించాలి, తిరిగి మంచి లుక్ లోకి మారి సినిమాల్లో ఎలా నటించాలి అనే విషయంలో నా ప్లాన్స్ నేను వేసుకున్నా. కానీ నేను అన్నుట్లు ఏమీ జరగలేదు. అంతా రివర్స్ అయింది అని సమీరా రెడ్డి తెలిపింది. బాబు పుట్టాక నాకు ఊహించని సమస్యలు ఎదురయ్యాయి. నా జీవితంలో అది చాలా ఇబ్బందికరమైన దశ అని సమీరా రెడ్డి తెలిపింది.

వ్యాధి సోకింది

వ్యాధి సోకింది

మహిళలకు కాన్పు తర్వాత కొన్ని సమస్యలు ఎదురవుతాయి. నేను కూడా అలంటి వ్యాధులతో బాధపడ్డాను అని సమీరా తెలిపింది. దాదాపు 5 నెలలపాటు బెడ్ కె పరిమితం అయ్యా. ఇంట్లోనుంచి బయటకు రాలేదు. సరైన వ్యాయామం లేకపోవడం, ఇంట్లోనే ఉండడం వలన క్రమంగా బరువు పెరుగుతూ వచ్చాను. దీనితో కొన్ని సార్లు కింద పడిపోయేదాన్ని అని సమీరారెడ్డి తెలిపింది. అలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని కార్యక్రమాలకు తప్పనిసరి పరిస్థితుల్లో హాజరు కావాల్సి వచ్చేది. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అవన్నీ తప్పవు అని తెలిపింది.

102 కేజీల బరువు

102 కేజీల బరువు

నాకు బాబు పుట్టాక ఊహించని రీతిలో 102 కేజీల బరువుకు చేరుకున్నా అని సమీరా రెడ్డి తెలిపింది. ఆ సమయంలో నన్ను నేనే గుర్తుపట్టలేనంతగా మారిపోయా. అదే బరువుతో కొన్ని సందర్భాల్లో బయటకు వెళ్ళినప్పుడు నాపై కామెంట్స్ వినిపించాయి. ఆమె హీరోయిన్ సమీరా రెడ్డే కదా.. ఏమైంది ఆమెకు అలా అయిపోయిందేంటి లాంటి కామెంట్స్ విన్నా. ఆ కామెంట్స్ తనని మరింత ఇబ్బందికి గురిచేశాయని సమీరా తెలిపింది.

మానసిక ఆందోళన

మానసిక ఆందోళన

నటిగా తిరిగి రాణించాలని ప్రయత్నిస్తున్న తనకు బరువు పెరగడంతో మరింత మానసిక ఆందోళనకు గురయ్యానని సమీరా తెలిపింది. ఆ సమయంలో మానసిక వైద్యులని కూడా కలిశాను. వారి సలహాలు ఉపయోగపడ్డాయి. నటిగా ఉన్నప్పుడు, భార్యగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తీసుకున్నాను. ప్రస్తుతం రెండవసారి తల్లి కాబోతున్న తాను ధైర్యంగా ఉన్నానని సమీరా రెడ్డి తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X