నైతిక విలువలు లేవంటూ...సమీరా విమర్శలు
బాలీవుడ్ జనాలకు నైతిక విలువలు లేవంటూ మండి పడుతోంది హాట్ హీరోయిన్ సమీరారెడ్డి. ఏమిటీ నైతిక విలువలు అవీ ఇవి అంటూ ఇంత పెద్ద మాట అంటుందేమీటి అనుకుంటున్నారా? ...మరి ఆవిడకు అక్కడ సరైన ప్రాధాన్యం లభించడం లేదు అందుకే ఇలా విమర్శలు గుప్పిస్తోంది. అంతే కాదు బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాలే బెస్ట్ అంటోంది ఈ భామ.
ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీ చిత్రాల్లో కూడా బిజీగా వున్న దక్షిణాది మీడియాతో మాట్లాడుతూ... అక్కడి సినీ జనాలకు నైతిక విలువలు ఎక్కువగా వుండవు. అపజయాల్లో మన పక్కన వుండటానికి ఎవరూ ఇష్టపడరు" అంటూ విమర్శలు గుప్పించింది. దక్షిణాది వారికి కొంచెం భక్తి ఎక్కువ. ఎవరైనా నచ్చారంటే వారికోసం ఎలాంటి త్యాగానికైనా సిధ్ధపడుతారు" అని చెప్పింది. రేపు సౌత్ లో అవకాశాలు సన్నిగిల్లిన తర్వాత కూడా మన వాళ్లని కూడా ఇలానే తిట్టిపోస్తుందేమో? ఎవరికి తెలుసు! మరి హిందీ జనాలకు నైతిక విలువలు లేవంటూ తిట్టి పోస్తున్న సమీరా తీరుపై అక్కడి వారు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











