హీరోయిన్ చూపించిన అందలాకు ఫ్యాన్స్ తో కేక పెట్టిస్తోంది...
హాట్ గాళ్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ సమీరా రెడ్డి ప్రస్తుతం 'స్కూబా డైవింగ్ సాహసాలతో 'డైనమిక్ లేడీ" లనే ప్రశంసలు అందుకుంటుంది. ఈ అమ్మడికి ఎప్పటినుంచో సముద్రంలోకి దూకి నీటి అడుతు బాగంలో ఏమేం ఉన్నాయో చూడాలనే కోరిక ఉందట. ఇక ఎంతో దైర్య సాహసాలతో సమీరా ఇటీవల లండన్ లో స్కూబా డైవ్ చేసి తన కోరికను తీర్చుకుంది. ఈ అందమైన దశ్యాలనంతా సమీరా వీడియో తీశారు. ఆ వీడియోను తన ట్విట్టర్ లో కూడా పెట్టారు.
కాగా తన ట్విట్టర్ లో ఉన్న వీడియోను తిలకించిన వారంతా ఈ ముద్దుగుమ్మపై రకరకాల మెసేజ్ లు పోస్ట్ చేసేశారు. అందులో కొందరేమో సమీరా చాలా ధైర్య సాహసాలు గల అమ్మాయి అని అంటుంటే..మరికొందరేమో..'సమీరా నువ్వు కేక..నువ్వు అమ్మాయివి కాదు..నీ ఆ సాహసం చూసినా మనసు నీపై పారేసుకున్నా.." ఇలా రకరకాలుగా తమ అభినందనలను పోస్ట్ చేశారు..
ఈ స్కూబా డైవ్ గురించి సమీరా మాట్లాడుతూ నీళ్లలోనికి దూకడం ఎవరికైనా భయంగానే ఉంటుంది. అయితే నీటి లోపల ఏఏ రకాల జీవరాశులుంటాయో తెలుసుకోవాలనే నా కోరికను భయం అధిగమించింది. ఆ ధైర్యంతోనే ఓ శుభముహోర్తానా ఈ సాహసం చేశా. చిన్న, పెద్ద చేపలు, నీటిలోని అనేక రకాల జీవ చరాలను చూశా. స్కూబా డైవ్ ఎంతో అద్బుతమైన అనుభూతినిచ్చింది. ఈ అమ్మడు ఇప్పటికే స్విమ్మింగ్ లో ప్రావీణ్యం పొందిన ఛాంపియన్ స్విమ్మర్. ఇక ఇప్పుడు స్కాబాలో కూడా సర్టిఫికెట్ పొందాలనుకుంటున్నారు. దీని కోసం స్కూబా డైవ్ ఎక్స్ పర్ట్ వద్ద సమీరా శిక్షణ తీసుకుంటుందని తెలుస్తోంది. అయితే గతంలో జెనీలియా, శ్రియ లాంటి హీరోయిన్స్ కూడా స్కూబా డైవింగ్ చేసొచ్చారు అయితే వారు ఇలాంటి సాహంతో కూడిన వీడియోస్ ని తమ వెంట తీసుకురాలేదు. ఆ సాహసాన్ని సమీరా రెడ్డి చెసిందంటూ ప్రశంసిస్తున్నారు..


Click it and Unblock the Notifications











