ఎన్టీఆర్ మాజీ ప్రియురాలుకి ‘లెస్బీయన్’ కోరిక
జూ.ఎన్టీఆర్ తో ప్రేమ వ్యవహారం నడిపించిన సమీరా రెడ్డి ఇప్పుడు బాలీవుడ్ లో అస్ధిత్వం కోసం పోరాడుతోంది.అందుకోసం ఆమె రకరకాల స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తోంది.తాజాగా ఆమె.. వేశ్య, లెస్బీయన్ టైప్ పాత్రలు నాకు వస్తే బావుండును. ఆ పాత్రల్లో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. వాటిని పండించగలిగితే... నటిగా నేను ఎంతో సాధించినట్టే. అందుకే అలాంటి పాత్రలు ఎవరిస్తారా అని ఎదురు చూస్తున్నాను అంది. ఇదేంటి ఇలాంటి కోరకలు వెల్లబుచ్చుతున్నారు అంటే..ఎంత సేపూ పాటల్లో గ్లామర్ ఒలికించడాలూ,హీరోలతో తెరపై డాన్స్ లు చేయటాలు ఎన్నాళ్లు చేస్తాం చెప్పండి.ఇంతకాలం ఎన్నో పాత్రలు ఆత్మవంచన చేసుకొని చేశాను.అలాంటి పాత్రలపై ఓ విధంగా నాకు విరక్తి కలిగింది. అందుకే కొత్తదనం కోసం అన్వేషిస్తున్నాను అని తేల్చేసింది. ప్రస్తుతం ఆమె మూడు హిందీ సినిమాల్లో, నాలుగు తమిళ సినిమాల్లో నటిస్తోంది.త్వరలో తెలుగులో కూడా సక్సెస్ సాధిస్తాను అంది.


Click it and Unblock the Notifications











