‘థ్రిలర్’ కి టబును రెకమెండ్ చేసిన నాగ్!
'ఏ మాయ చెసావె" చిత్ర విజయంతో గాల్లో తేలుతున్న గౌతమ్ మీనన్, ప్రస్తుతం ఓ థ్రిల్లర్ కథాంశం తో ఒక తక్కువ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఈ చిత్రంలో సమీరా రెడ్డి హీరోయిన్ గా నటిస్తోందట. ఆమె తో పాటు టబుకి కూడా ఓ క్యారెక్టర్ ఇమ్మని నాగార్జున గౌతమ్ కి రెకమెండ్ చేశాడట. సో కొత్త తరహా కథనంతో రాబోతున్న ఈ చిత్రంలో టబూ, సమీరా రెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం.
తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్ కేవలం 30 రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమా అయిపోగానే, గౌతమ్ మీనన్ 'ఏ మాయ చెసావె" హింది రీమేక్ ని మొదలు పెడతాడు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున, నాగచైతన్యలతో చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అవుతున్నాడు..ఈ చిత్రంతో మూడు తరాలను పరిచయం చేసిన డైరెక్టర్ గా రికార్డ్ సృష్టించనున్న గౌతమ్ నాగ్ కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటానని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











