twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రీమియర్ షో టాక్: అదితి నటనకు 'సమ్మోహనం' అవుతారు.. అదిరిపోయే సెటైర్, ఆ ఒక్కటి తప్ప!

    |

    Recommended Video

    Sammohanam Movie Premier Show Talk

    సుధీర్ బాబు, అదితి రావు జంటగా నటించిన సమ్మోహనం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్, ట్రైలర్స్ లో ఈ చిత్రంలోని ప్రెష్ కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సుధీర్ బాబు కెరీర్ కు సమ్మోహనం చిత్రం చాలా కీలకం. విడుదలకు ముందే సమ్మోహనం చిత్రం పాజిటివ్ బజ్ సొంతం చేసుకుంది. సీనియర్ నటుడు నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. యుఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడ్డాయి. సుధీర్ బాబు, అదితిల సమ్మోహనం ఏమేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

    విడుదలకు ముందే

    విడుదలకు ముందే

    వరుసగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్స్ సమ్మోహనం చిత్రంపై ఆసక్తిని పెంచాయి. తాజాదనం కనిపించడంతో విడుదలకు ముందే సమ్మోహనం చిత్రం పాజిటివ్ బజ్ సొంతం చేసుకుంది. అదే స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.

    అదిరిపోయే టాక్

    అదిరిపోయే టాక్

    యుఎస్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సమ్మోహనం చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరో మారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ వెండితెరపై మ్యాజిక్ చేశారని అంటున్నారు.

    సమ్మోహన పరిచిన అదితి

    సమ్మోహన పరిచిన అదితి

    ప్రచార చిత్రాల్లోనే హీరోయిన్ అదితి రావు హైదరి పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో అదితి అప్ కమింగ్ హీరోయిన్ పాత్రలో నటించింది. అదితి పాత్ర ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

    సైలెంట్ గా సెటైర్

    సైలెంట్ గా సెటైర్

    చిత్ర పరిశ్రమపై కొందరిలో ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించేలా ఇంద్రగంటి మోహన్ కృష్ణ కొన్ని సెటైరికల్ సన్నివేశాల్ని చూపించారు.

    కెమిస్ట్రీ కేక

    కెమిస్ట్రీ కేక

    అదితి రావుకు తెలుగు డైలాగ్స్ నేర్పించే గైడ్ పాత్రలో సుధీర్ బాబు కనిపించాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. చిత్రంలో పాటలు, లొకేషన్స్, అందమైన విజువల్స్ మరో ప్లస్ పాయింట్.

    ఫస్ట్ హాఫ్ స్లోగా సాగినప్పటికీ

    ఫస్ట్ హాఫ్ స్లోగా సాగినప్పటికీ

    ఫస్ట్ హాఫ్ ని దర్శకుడు ఎక్కువగా సాగదీసినట్లు తెలుస్తోంది. అయినా కానీ మంచి సన్నివేశాలు పడ్డాయి. స్లోగా సాగుతున్నా ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు.

    హాస్యం పండించిన నరేష్

    హాస్యం పండించిన నరేష్

    ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ పాత్ర కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఆయన పాత్ర ద్వారా దర్శకుడు మంచి హాస్యాన్ని రాబట్టారు. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ రాహుల్ రామ కృష్ణ పాత్ర కూడా బావుంది. సుదీర్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు.

    కలసి వచ్చే అంశం

    కలసి వచ్చే అంశం

    సమ్మోహనం చిత్రం సుధీర్ బాబు కెరీర్ లో మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. చిత్రంలో తాజాదనం ఉండడం, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ, నరేష్ పాత్ర ఇలా చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. బరిలో ఉన్న చిత్రాలన్నీ నెగిటివ్ టాక్ తో రన్ అవుతుండడం కూడా సమ్మోహనం చిత్రానికి కమర్షియల్ గా కలసి వస్తుందని చెప్పొచ్చు.

    English summary
    Sammohanam Movie premier show talk. Once again Indraganti Mohan Krishna shows his magic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X