'రచ్చ' కళాఖండమేమీ కాదు:సంపత్ నంది

By Srikanya

పాటల విడుదలకు ముందు మా సినిమాపై ఎవరికీ పెద్ద నమ్మకాలు లేవు. పాటలు, ప్రోమోలు చూసిన తరవాత అంచనాలు పెంచుకొన్నారు. వాటిని 'రచ్చ' సినిమా అందుకొంది. నేనేమీ కళాఖండం తీయలేదు. ఓ మంచి కమర్షియల్ చిత్రం తీశాను అన్నారు దర్శకుడు సంపత్ నంది. రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహించిన చిత్రం 'రచ్చ'. మెగా సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించింది. 'రచ్చ' విజయోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ నంది ఇలా స్పందించారు.

అలాగే ...రచ్చ అంటేనే రామ్‌చరణ్‌, రామ్‌చరణ్‌ అంటేనే 'రచ్చ'. ఈ విషయం ముందు నుంచీ చెబుతున్నదే. ఇప్పుడు ఆ మాటే నిజమైంది అన్నారు సంపత్‌నంది. అలాగే ఈ చిత్రం నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాని అనుకొన్న సమయంలో ప్రేక్షకుల ముందుకు త్వరగా తీసుకురావాలనే లక్ష్యంతో చరణ్‌ కష్టపడి పనిచేశారు. ప్రమాదానికి గురైనా సరే... నొప్పిని ఓర్చుకొంటూ ఓ పాటకు నృత్యం చేశారు. ఆయన కష్టం ఫలించింది. దాదాపు 250 థియేటర్లలో తమిళ భాషలోనూ విడుదల చేశాం. అక్కడా మంచి స్పందన వస్తోంది. త్వరలో మలయాళంలో అనువదిస్తామని అన్నారు.

ఈ సందర్భంగా మరో నిర్మాత పారస్ జైన్ మాట్లాడుతూ...మా సంస్థ నుంచి ఇది వరకు అన్నీ కుటుంబ కథాచిత్రాలే వచ్చాయి. తొలిసారి మాస్‌ చిత్రాన్ని రూపొందించాం. 'రచ్చ'కు వస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇదంతా మా చిత్రబృందం పడిన కష్టమే ‌. ఈ కార్యక్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు, వాకాడ అప్పారావు, గౌతంరాజు, ఆనంద్‌సాయి, సమీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'రచ్చ'క్రిందటి గురువారం విడుదలైంది. భారీ ఓపినింగ్స్ తో వచ్చిన ఈ చిత్రం డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఎవరినీ నిరాశపరచటం లేదు. చిత్రంలోని వానా వానా వెల్లువాయే పాట, రచ్చ టైటిల్ సాంగ్ బాగా ఆకట్టుకుంటున్నాయి. తమన్నా అందాలు,రామ్ చరణ్ ఎనర్జీతో కూడిన నటన ఈ సినిమాకు యు.ఎస్.పి గా నిలిచి నిలబెడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X