పవన్ ‘చోటా మేస్త్రీ’పై సంపత్ నంది స్పందన
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రచ్చ దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో రూపొందబోయే చిత్రానికి 'చోటా మేస్త్రీ' అనే టైటిల్ ఖరారైనట్లు వస్తున్న వార్తలను ఆ చిత్ర దర్శకుడు సంపత్ నంది ఖండించారు. అదే విధంగా ఈచిత్రానికి రమణ గోగుల పని చేస్తున్నరనే వార్తలను కూడా ఆయన తోసి పుచ్చారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈచిత్రం పూర్తయిన తర్వాత పవన్-సంపత్ నంది చిత్రం సెట్స్ పైకి వెళ్ల నుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ లేదా అంజలిని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
దర్శకుడు సంపత్ నంది ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంభందించిన స్క్రిప్టు వర్క్ మొదలు పెట్టారు. ఈ చిత్రాన్ని పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. చాలా కాలంగా పవన్ కళ్యాణ్, శరత్ మరార్ మంచి స్నేహితులు కావటంతో ఈ అవకాశం శరత్ మరార్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక పవన్-త్రివిక్రమ్ సినిమా వివరాల్లోకి వెళితే... ఈచిత్రంలో సమంత, ప్రణీత హీరోయిన్లు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











