»   » రామ్ చరణ్ 'రచ్చ' స్టోరీ లైన్ రివిల్

రామ్ చరణ్ 'రచ్చ' స్టోరీ లైన్ రివిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్,తమన్నా కాంబినేషన్ లో సంపత్ నంది రూపొందిస్తున్న చిత్రం రచ్చ.ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో స్టోరీ పాయింట్ ని వివరిస్తూ దర్శకుడు... ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. అడ్డొస్తే... ఇక రచ్చ రచ్చే. ఇలాంటి మనస్తత్వం ఉన్న కుర్రాడే మా హీరో. అతను సృష్టించిన హంగామా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొంత కాలం ఆగండి అంటున్నారు .ఎన్వీ ప్రసాద్‌, పారాస్‌జైన్‌ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.

ఇక ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ .. చరణ్‌కి సరిపడిన కథ ఇది. పూర్తిగా మాస్‌ అంశాల్ని మేళవించాం. ఇది వరకు చేసిన మూడు సినిమాల్లో కంటే విభిన్నంగా కనిపిస్తాడు. దర్శకుడు కథను తెరకెక్కిస్తున్న విధానం బాగుంది. ఈయేడాదిలోనే సినిమాని విడుదల చేస్తామేు అన్నారు.ఇక ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుగుతున్న షూటింగ్ ఆగస్టు 15 వరకూ ఉంటుంది. ఈ షెడ్యూల్ లో చరణ్‌, తమన్నాలపై ఓ పాటని తెరకెక్కిస్తారు. ఆ తరవాత యూనిట్ మొత్తం చైనా వెళ్లనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్‌, ఛాయాగ్రహణం:సమీర్‌రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.

English summary
Rachcha- Ram Charan film with director Sampath Nandi shoot is progressing in Bangkok . The shoot will go on till 15th of this month in Bangkok and then the film unit will move to China for further schedule shoot. Producers are planning to release the film in the year 2011 itself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu