'రచ్చ'అని ఎందుకు పెట్టానంటే...సంపత్ నంది
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ కి దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి రచ్చ అని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మీడియాకు వివరించారు. ఆయన మాటల్లోనే...రచ్చ అంటే నా మీనింగ్ సెలబ్రేషన్ అని. దాని ఫెరఫెక్ట్ మీనింగ్ అయితే మెస్సప్. కానీ నేను సెలబ్రేషన్ అన్నది తీసుకున్నాను అన్నారు. ఆ టైటిల్ పెట్టడానకి మరో రీజన్ రామ్ చరణ్ పేరు లోని రామ్ లోని ర ని, చరణ్ లోని చ ని తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు.
ఇక చిత్రంలో రామ్ చరణ్ ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారన్న విషయం చెపుతూ... రామ్ చరణ్ ఇంతకు ముందు ఏ చిత్రంలోనూ కనపించనంత అందంగా కనిపిస్తారు. ఇక ఈ చిత్రం రిలీజయ్యాక అమ్మాయిల పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి అన్నారు. అలాగే ఆరెంజ్,మగధీర,చిరుతలో కనిపించ దానికి రెండు మూడు రెట్లు బెటర్ గా కనపిస్తారు అన్నారు. గ్యాంగ్ లీడర్,ఘరానా మొగుడులో చిరంజీవిగారిలో కనిపించే ఫైర్ ఈ చిత్రంలో మీకు కనిపిస్తుంది అన్నారు. ఆ విషయానికి ఫ్యాన్స్ కి ప్రామిస్ చేస్తానని అన్నారు. ఈ సినిమాలో పాతికేళ్ల చిరంజీవిగారిలా ఉంటారని అన్నారు. ఇక చరణ్ గారు రచ్చ రచ్చ చేయటానికి రెడీ గా ఉన్నారు. ఇక చిరంజీవి కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఒక దేవుడిలా ఆయన ఫొటో తన ఇంట్లో పెట్టుకుంటానని తెలిపారు.


Click it and Unblock the Notifications











