'రచ్చ'టైటిల్ అర్దమేమిటంటే... సంపత్ నంది
'రచ్చ' అంటే ఆనందంతో సెలబ్రేట్ చేసుకునేది అని మా చిత్రంలోని అర్థం. చిత్ర కథ కూడా అలాగే ఉంటుంది. హీరో ఎప్పుడూ అన్నింటిలో ముందుండాలనుకునే వ్యక్తి. అందరినీ ఎలా రచ్చ చేశాడు అన్నది పాయింట్. అని దర్సకుడు సంపత్ నంది తమ చిత్రం రచ్చ చిత్రం టైటిల్ గురించి చెప్పారు. అలాగే మణిశర్మ ఆడియోకు మంచి స్పందన వచ్చింది. చిన్నిచరణ్, చంద్రబోస్ చక్కటి సాహిత్యాన్ని అందించారు. 'తిల్లా తిల్లా తెల్లకోడిపిల్ల..' అనే పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది అన్నారు.
మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఆర్.బి. చౌదరి సమర్పకులు. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు.ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ, నెలాఖరుతో షూటింగ్ పూర్తవుతుంది. ఇప్పటికే ఆడియోకు మంచి స్పందన లభించింది. సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నామన్నారు. ఈ చిత్రంలో నాజర్, కోటశ్రీనివాసరావు, ముఖేష్‌రుషి, పార్తీబన్, బ్రహ్మానందం, అలీ, గీత, ఝాన్సీ, ప్రగతి, సుధ, హేమ తదితరులు నటించారు. మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: సమీర్‌రెడ్డి, కళ: ఆనంద్‌సాయి, నిర్మాతలు: ఎన్.వి. ప్రసాద్, పారస్‌జైన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌నంది.


Click it and Unblock the Notifications











