'రచ్చ' టైటిల్ తోనే సినిమా చేస్తానంటున్నాడు
తెలుగులో నా తదుపరి చిత్రం 'రచ్చ' మాస్ ఎంటర్ టైనర్ ఇతివృత్తంతో ఉంటుంది. ఓ ప్రముఖ హీరో ఇందులో నటిస్తారు అంటూ రీసెంట్ గా ఇంటర్వూ ఇచ్చాడు దర్శకుడు సంపత్ నంది. ఆయన తాజాగా వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ కాంబినేషన్ లో 'ఏమైంది ఈ వేళ' చిత్రం రూపొందించారు. ఈ శుక్రవారంతో 50 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 'రచ్చ' ప్రస్దావన తెచ్చారు. అలాగే ఈ రచ్చ అనే టైటిల్ ని ఓ మాస్ హీరోతో చేయటానికి పెట్టుకున్నానని, దానిని రిజిస్టర్ చేసి రెండుసార్లు రెన్యువల్ చేసానని అంటున్నారు. ఇక 'రచ్చ' టైటిల్ తో సురేంద్రరెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్ ని వాళ్ళు బృందావనం చిత్రంలోని బృందావనం చిత్రంలోని 'పట్నం నుంచి వచ్చాడు లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకోకండి..క్యాకెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా..లోపల మాస్ అలాగే ఉంది..వాడు బయటకు వచ్చాడో రచ్చ రచ్చే.." అనే డైలాగునుంచి రచ్చ అనే టైటిల్ పుట్టింది అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











