చిరంజీవి వెన్ను తట్టబట్టే ఆ రేంజి హిట్
'రచ్చ' సినిమా అద్భుతంగా తీయడానికి చిరంజీవిగారి సపోర్టు చాలా ఉంది. నూట నలభై తొమ్మిది సినిమాలు చేసిన అనుభవంతో చిరంజీవి గారు నన్ను వెన్నుతట్టిన విధానం, ముఖ్యంగా 'వానా వానా...' పాట అంత బాగా రావడానికి ఆయన ఇచ్చిన సలహాలు ఎప్పటికీ మరువలేను అన్నారు రామ్ చరణ్ తేజ. రామ్‌చరణ్, తమన్నా జంటగా ఆయన రూపొందిన 'రచ్చ' గురువారంతో అర్ధశతదినోత్సవం జరుపుకుంటున్న సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే...''రచ్చ విజయంతో 'బిఫోర్ రచ్చ', 'ఆఫ్టర్ రచ్చ'లా మారింది నా జీవితం. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, సర్కిల్ ఏర్పడ్డాయి. పెద్ద హీరోలు కూడా పిలిచి నన్ను సినిమాలు చేయమని అడగటం జరిగింది అన్నారు. అలాగే 'రచ్చ' విజయంతో పడిన శ్రమకు ఫలితం దక్కిందని, ఆ సినిమా విడుదలైన వెంటనే వీవీ వినాయక్‌గారు ఫోన్‌చేసి 'కంగ్రాట్స్' చెప్పడం జీవితంలో మరచిపోలేనని ఆయన అన్నారు.
వరుణ్ సందేశ్ 'ఏమైంది ఈ వేళ' సినిమాతో దర్శకుడుగా పరిచయమై, రెండో సినిమాయే స్టార్‌హీరోతో చేసే అవకాశం పొందడం అదృష్టం అన్నారు. ఇక తను దర్శకుడుగా పైకి రావడానికి తన భార్య భవాని సహకారం చాలా ఉందని, కొడుకు 'యువ' పుట్టిన రోజునే 'ఏమైంది ఈ వేళ' సినిమా ఓకే అయ్యిందని సంపత్ నంది చెబుతూ, ప్రస్తుతం శానం నాగఅశోక్‌కుమార్ బేనరులో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. పోసాని కృష్ణమురళి వద్ద, ఎన్.శంకర్ వద్ద రచయితగా పనిచేసి, ముంబయ్‌లో జానీలాల్, శివలవద్ద కెమెరా విభాగంలో అనుభవం పొంది సినిమా దర్శకుడుగా మారినట్లు సంపత్ తెలిపారు.
అలాగే 'రచ్చ' సినిమా నాకు రావడానికి ప్రధాన కారకులు శానం నాగఅశోక్‌కుమార్‌గారు. ఆయన తిరుపతి ప్రసాద్‌గారికి చెప్పడం, వారిద్దరు కలిసి నన్ను చిరంజీవిగారి దగ్గరకు పంపడం, ఆయన కథ మొత్తం విని వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయాయి. ఇక రామ్‌చరణ్ పూర్తి స్వేచ్ఛ, సహకారం ఇచ్చారు. మణిశర్మగారు, స్టంట్ శివ బాగా సహకరించారు. తమన్నా కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు'' అన్నారు సంపత్ నంది. ఇక చిరంజీవి కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఒక దేవుడిలా ఆయన ఫొటో తన ఇంట్లో పెట్టుకుంటానని తెలిపారు.


Click it and Unblock the Notifications











