మెగాస్టార్ నే మెప్పించాడు-ఇక తిరుగులేదు!
ఎవరైనా ఎపుడైనా సినిమా ద్వార దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది...ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పరిశ్రమలో అందరి చూపులు తనపై పడేలా చేసుకున్న సంగతి తెలిసింది. దాని ఫలితంగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'రచ్చ" సినిమా చేసే అవకాశం దక్కింది ఈ దర్శకుడికి. తాజాగా రచ్చ సినిమా షూటింగులో భాగంగా చిరంజీవి సినిమాలో 'వాన వాన" పాటను రిమిక్స్ చేసి రామ్ చరణ్ తమన్నాలపై అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరిస్తున్నారు. గతంలో చిరంజీవి సినిమాలోని బంగారు కోడి పెట్ట పాట రీమిక్స్ మగధీర సినిమాలో మంచి హిట్టయిన నేపథ్యంలో ఈ పాటకు కూడా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు.
ఈ షూటింగ్ స్పాట్ లో సడన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా యూనిట్ సభ్యులు పని తీరును స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన రామ్ చరణ్ కు సలహాలు, సూచనలు ఇచ్చారు. అదే విధంగా సంపత్ నంది, కొరియోగ్రాఫర్ల పని తీరును మెచ్చుకున్నారు. పాట చిత్రీకరణ అద్భుతంగా ఉందని, మంచి ఔట్ పుట్ వచ్చిందని అన్నట్లు తెలిసింది. స్వయంగా మెగాస్టార్ మెుప్పుపొందిన సంపత్ నంది కెరియర్ కు ఇక తిరుగు ఉండదని, రచ్చ సినిమా హిట్టయితే సంపత్ టాలీవుడ్ అగ్రదర్శకుల సరసన చేరడం అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications