ఆయన బంగారం.. డ్రగ్స్‌తో లింకు లేదు.. పవన్ గురించి కాదు..

By Rajababu

టాలీవుడ్ అభిరుచి గల దర్శకుల్లో ఒకరైన సంపత్ నంది డ్రగ్స్ వ్యవహారంపై స్పందించారు. డ్రగ్స్ వినియోగం సమాజానికి మంచి కాదు అని ఆయన అన్నారు. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం గౌతమ్‌నంద జూలై 27 రిలీజ్‌‌కు సిద్ధమవుతున్నది. ఈ నేఫథ్యంలో ఆ చిత్రాల విశేషాలను, డ్రగ్స్ వివాదంపై సంపత్ నంది ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా పంచుకొన్నారు. సంపత్ నంది ఏమన్నారో ఆయన మాటల్లోనే..

నేను చాలా దూరం

నేను చాలా దూరం

డ్రగ్స్ వినియోగానికి నేను చాలా దూరం. నా అలవాట్లు. ఆరోగ్యం గురించి నేను తీసుకొనే జాగ్రత్తలు అందరికి తెలిసిందే. డ్రగ్స్ వాడారా లేదా అనే విషయం సిట్ అధికారులు తేలుస్తారు. ఈ విషయంలో నేను ప్రత్యేకంగా వెల్లడించాల్సిన అవసరం లేదు. కానీ సొసైటీకి ఇది మంచిది కాదు అని సంపత్ నంది అన్నారు.

Recommended Video

Goutham Nanda Movie Audio Launch : Udaya Bhanu Got Shocked
డ్రగ్స్‌కు రవితేజకు సంబంధం లేదు

డ్రగ్స్‌కు రవితేజకు సంబంధం లేదు

నా దర్శకత్వంలో వచ్చిన బెంగాల్ టైగర్ చిత్రంలో రవితేజ నటించారు. ఆయన డ్రగ్స్, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉంటాడు. డ్రగ్స్ ఆరోపణలు రావడం చాలా బాధకలిగించింది. రవితేజ చాలా మంచి మనిషి. అందుకే ఆడియో ఫంక్షన్‌లో రవితేజ్ బంగారం అని చెప్పాను.

ఏడాది పాటు కలిసి పనిచేశాను..

ఏడాది పాటు కలిసి పనిచేశాను..

రవితేజ్‌తో నేను దాదాపు ఏడాదిన్నర ట్రావెల్ చేశాను. బెంగాల్ టైగర్ షూటింగ్ సందర్భంగా ఆయన ప్రవర్తనను దగ్గరగా చూశాను. మంచి పేరు ఉంది. ప్రతిష్ఠ ఉంది. ఒక్కసారి వారిపై దారుణంగా ఆరోపణలు రావడం చాలా బాధ అనిపించింది.

టాలెంట్‌కు అద్దం పట్టాయి

టాలెంట్‌కు అద్దం పట్టాయి

పెళ్లిచూపులు, ఫిదా లాంటి చిత్రాలు రావడం టాలీవుడ్‌‌లోని టాలెంట్‌కు అద్దం పడుతున్నది. దర్శకులు శేఖర్ కమ్ముల, తరుణ్ భాస్కర్ చాలా నిజాయితీగా తీశారు. అంతే నిజాయితీతో ప్రేక్షకులు నమ్మారు. దీంతో పరిశ్రమకు మంచి పరిణామం అని చెప్పవచ్చు.

పోసాని కృష్ణమురళీ అంటే ఇష్టం

పోసాని కృష్ణమురళీ అంటే ఇష్టం

నాకు చిత్ర పరిశ్రమలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు. స్వయంకృషితో పైకి వచ్చాను. పరిశ్రమలో నాకు బాగా నచ్చిన వ్యక్తి పోసాని కృష్ణమురళిగారు. ఆయన వద్ద నేను పనిచేశాను. ఆయన నుంచి మంచి విషయాలు నేర్చుకొన్నాను. ఆయనను గురువుగా భావిస్తాను. పరిశ్రమలో సుధాకర్ అనే మిత్రుడు ఉన్నాడు. 15 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నాం. కష్టాలను, సుఖాలను అతడితోనే పంచుకొంటాను.

పవన్ కోసం కాదు..

పవన్ కోసం కాదు..

పవన్ కల్యాణ్ కోసం గౌతమ్ నంద కథ‌ను రాయలేదు. కథ రాసుకొన్న తర్వాత నిర్మాతల ఛాయిస్ మేరకు గోపిచంద్‌ను కథ వినిపించాను. సింగిల్ సిట్టింగ్‌లోనే కథ ఓకే అయింది. కథకు తగినట్టుగా గోపిచంద్‌ మేకోవర్ చేయించాం. పవన్ కల్యాణ్‌కు హెయిర్ స్టయిలిస్ట్‌గా పనిచేసే హెయిర్ స్టైలిష్ట్‌‌ సహాయంతో గోపిచంద్‌ కొత్త లుక్‌ను తీసుకొచ్చాం. ఆ తర్వాత గోపిచంద్ లుక్‌ను చాలా మందికి షేర్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో కంటిన్యూ చేశాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X