'రచ్చ'కథ అలా ఓకే అయ్యింది:సంపత్ నంది
రామ్‌చరణ్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వం వహించిన 'రచ్చ' ఈరోజు(గురువారం)విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంపత్ నంది ఈ చిత్రం కథ ఎలా ఓకే అయ్యిందో చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే...
"ఏమైంది ఈవేళ చూసిన తర్వాత సాయిదేవ ప్రొడక్షన్స్ అధినేత శానం అశోక్‌కుమార్ కథ ఉంటే చెప్పమన్నారు. 'రచ్చ' కథ చెప్పాను. ఒక్క రోజు ఆగు ఈ కథ పెద్ద హీరోకి చెప్పిస్తానన్నారు. అప్పుడు తిరుపతి ప్రసాద్‌గారు ఊరెళ్ళడంతో రెండు రోజులు ఆగాల్సి వచ్చింది.
ఓ రోజు ఉదయం ప్రసాద్‌గారు ఫోన్ చేసి మధ్నాహ్నం మూడు గంటలకు చిరంజీవిగారికి కథ చెప్పమన్నారు. ఆ రోజంతా జ్వరంతో పడుకుని ఉన్నా. కానీ చిరంజీవిగారికి కథ చెప్పే అవకాశం మళ్ళీ రాదు కదా అనుకుని ఓపిక తెచ్చుకుని వెళ్ళి కథ చెప్పాను. ఆయన విని 'బావుంది, చాలా బావుంది. నాకు ఓకే చరణ్‌కి నచ్చాలి కదా' అన్నారు. తర్వాత చరణ్‌కి చెప్పాను. తనకీ నచ్చింది. వెంటనే సినిమాని ఓకే చేసేశారు. కేవలం ఒక్క సినిమా చేసిన నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ బాధ్యతలను అప్పగించిన చిరంజీవిగారికి రుణపడి ఉంటాను అన్నారు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన తమన్నా గురించి చెపుతూ... ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. తన పాత్ర వల్లే కథలో మలుపు ఉంటుంది. తన కెరీర్‌కి వంద శాతం ఈ చిత్రం ప్లస్సవుతుంది. నిర్మాణ విలువలు అడుగడుగున కనిపిస్తాయి. నిర్మాతలు పూర్తి స్వాతంత్య్రాన్నిచ్చారు. వాకాడ అప్పారావుగారు అడిగినవేవీ ఇవ్వరని ఎంతో మంది భయపెట్టారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇంత గొప్పగా రావడానికి ఆయన సహకారం ఎంతో ఉంది అన్నారు.
అలాగే'రచ్చ'కథపరంగా మహాద్భుతం అని నేనెప్పుడూ ఎక్కడా చెప్పలేదు. కానీ మంచి స్క్రీన్‌ప్లే ఉంటుంది. ప్రతి 15 నిమిషాలకు ఆసక్తికరమైన విషయాలుంటాయి. రచ్చ అంటే సెలబ్రేషన్. హీరో ఏ పని చేసినా ఒక మూడ్‌తో, పాజిటివ్ ఎనర్జీతో చేస్తాడు. అందుకే ఆ టైటిల్‌ను రామ్‌చరణ్ పేరు నుంచే సెలక్ట్ చేసి పెట్టేశాం. ఈ చిత్రంలో చరణ్ అందంగా, మాన్లీగా కనిపిస్తున్నాడని చాలా మంది అన్నారు అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











