‘పేపర్ బాయ్’ స్టోరీ ముందే చెప్పేసిన సంపత్ నంది
సంపత్ నంది టీమ్‌వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా 'పేపర్ బాయ్'. సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా జయశంకర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ... 'పేపర్ బాయ్' ఒక సింపుల్ లవ్ స్టోరీ. గద్వాల్ రెడ్డిగారు అని ఉస్మానియా యూనివర్శిటీలో పని చేసే ఒక ప్రొఫెసర్ అమ్మాయికి, పేపర్ వేసుకునే కుర్రాడికి మధ్య జరిగే ప్రేమకథ. మన ఇంట్లో పేపర్ వేసే అబ్బాయి మన ఇంటి అమ్మాయిని ప్రేమిస్తే తర్వాత ఏ జరుగుతుంది అనే చాలా సింపుల్ కథ. కానీ ఇందులో సిచ్యువేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అప్రోచ్ చాలా హానెస్ట్ గా ఉంటుంది. చాలా నిజాయితీగా సినిమా తీశాం. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను అన్నారు.

ఈ సినిమా నాకు ఇద్దరు మంచి స్నేహితులను ఇచ్చింది. నేను రిలాక్స్ అయితే వెంకట్, నరసింహ స్నేహం ఎక్కడ దూరం అవుతుందో అని ఒళ్లు దగ్గర పెట్టుకుని రాశాను. ఈ సినిమా హిట్టయి ఇలానే స్విగ్గీబాయ్, కొరియర్ బాయ్ లాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాను.
సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ గురించి ముందుగా చెప్పాలి. బిల్లా, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద లాంటి సినిమాల తర్వాత ఇలాంటి ఒక చిన్న సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆయన ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ గా నిలిచాడు.హైదరాబాద్, ముంబాయి, లోనవాల, పూణే, కేరళ, గోవా వంటి నగరాల్లో ఈ సినిమా షూట్ చేశారు. ఆగస్టులో సినిమా విడుదల చేస్తున్నాం అన్నారు.
నటీనటులు:
సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా.
సాంకేతిక నిపుణులు:
కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : సంపత్ నంది.
డైరెక్షన్: వి. జయశంకర్
నిర్మాతలు: సంపత్ నంది,రాములు, వెంకట్, నరసింహ.
సంగీతం: భీమ్స్
ఎడిటర్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫి: సుందర్ రాజన్.
ఆర్ట్: రాజీవ్
స్క్రిప్ట్ కో ఆడినేటర్: సుధాకర్ పావులూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల


Click it and Unblock the Notifications











