ఎప్పటికైనా మెగాస్టార్‌ను డైరెక్ట్ చేయడమే డ్రీమ్... స్క్రిప్ట్ రెడీ చేస్తోన్న డైరెక్టర్

మొదటి చిత్రం ఏమైంది ఈవేళతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ సంపత్ నంది. మొదటి చిత్రంతోనే తన ప్రతిభను నిరూపించుకోవడంతో మెగా కాంపౌండ్‌ దృష్టి పడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పిలిచి మరీ అవకాశాన్ని ఇచ్చాడు. మెగా ఫ్యామిలీకి ఉన్న మాస్ ఇమేజ్‌ను వాడుకుని రచ్చ అంటూ మరో హిట్ కొట్టేశాడు. కమర్షియల్ విజయం సాధించిన ఈ చిత్రంతో మరోసారి సంపత్ నంది పేరు మార్మోగిపోయింది.

ఇక పవన్ కళ్యాణ్‌ కూడా ఓ అవకాశాన్ని ఇచ్చాడని, దాదాపు ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని టాక్ వచ్చింది. బెంగాల్ టైగర్ కథ పవన్ కోసం రాసిందేనని అప్పట్లో టాక్ కూడా వచ్చింది. అది కుదరకపోవడంతో రవితేజతో ఆ చిత్రాన్ని కానిచ్చేశాడు. ఇక 'సర్థార్ గబ్బర్‌సింగ్' చిత్రాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా మిస్ అయింది. ఇలా మెగా కాంపౌండ్‌లో కాస్త నిరాశ ఎదురైంది. చివరగా గోపీచంద్‌తో తీసిన గౌతమ్ నందా ఓ మోస్తరుగా మెప్పించింది.

Sampath Nandi Wants To Do A Film With Chiranjeevi

ప్రస్తుతం గోపీచంద్‌తో సీటీమార్ చిత్రాన్ని చేస్తున్న సంపత్ నంది.. ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడమే తన డ్రీమ్ అని తన కోరికను బయట పెట్టాడు. అంతేకాదు ఆయనతో ఎటువంటి సినిమా చేయాలని అనుకుంటున్నాడో కూడా చెప్పుకొచ్చాడు. తెలంగాణ రజాకార్ల నేపథ్యంలో ఓ స్క్రిప్ట్‌‌ని రెడీ చేస్తున్న ఆయన..స్క్రిప్ట్ అంతా పూర్తైన తర్వాత మెగాస్టార్‌ని కలుస్తానని చెప్పాడు. కచ్చితంగా మెగాస్టార్‌ని మెప్పించి, ఆయనతో సినిమా చేస్తానని నమ్మకంగా చెప్పాడు సంపత్ నంది. మరి ఈ దర్శకుడి కోరిక నెరవేరుతుందో లేదో కాలమే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X