సంపూర్ణేష్ బాబు...అతి తెలివి 100% (ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : హృదయ కాలేయం చిత్రంతో పరిచయమైన సంపూర్ణేష్‌బాబు కి నెట్ జనల్లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దాంతో సంపూ హీరో గా మరో సినిమా రెగ్యలుర్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో సంపూతో పాటు పృధ్వీ కూడా నటిస్తున్నారు. చిత్రం టైటిల్ వినోదం 100%. పొట్నూరు శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్‌మూర్తి దర్శకుడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు పాత్ర అతి తెలివితో చేసే పనులతో ఫన్ పుట్టించేదిగా ఉంటుందని చెప్తున్నారు.

డిసెంబర్‌లో మూడో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని పంచే చిత్రమిది. యువతరంతో పాటు కుటుంబ వర్గాల్ని అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.

సంపూర్ణేష్‌బాబు, పృథ్వీ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తమ అతి తెలివితో ఇద్దరు యువకులు చేసే సందడి అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నాం.

చిత్రం స్టిల్స్ ఒక్కసారి చూద్దాం...

విదేశాల్లో షూటింగ్..

విదేశాల్లో షూటింగ్..

కథానుగుణంగా విదేశాల్లో షూటింగ్‌ను జరిపారు. ఆ సీన్స్ సినిమాల్లో హైలెట్ గా ఉంటాయని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

మూడో షెడ్యూల్..

మూడో షెడ్యూల్..

డిసెంబర్‌లో ప్రారంభమయ్యే మూడో షెడ్యూల్‌లో హైదరాబాద్‌లోని గోల్కోండ పరిసర ప్రాంతాల్లో పలు కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు.

విడుదల ఎప్పుడు...

విడుదల ఎప్పుడు...

జనవరి ప్రథమార్థంలో ఆడియోను, ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెరముందు...

తెరముందు...

పృధ్వీ, సంపూర్ణేష్ బాబు కాకుండా...సత్యం రాజేష్, విజయ్ భరత్, అశ్విని, సప్తగిరి, పోసాని కృష్ణమురళి,తాగుబోతు రమేష్, జయప్రకాష్‌రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

తెర వెనక...ఈ చిత్రానికి సంగీతం

తెర వెనక...ఈ చిత్రానికి సంగీతం

సుభాష్ ఆనంద్, కథ: జయకుమార్, మాటలు: అంజన్, పాటలు: చిర్రాపూరి విజయ్‌కుమార్.

మరో చిత్రం

మరో చిత్రం

సింగం 123 టైటిల్ తో సంపూ హీరోగా మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తమ 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించనున్నారు. తమిళ హిట్ సింగం కి స్పూఫ్ లా ఉంటుందని వినికిడి.

మంచు విష్ణు మాట్లాడుతూ...

మంచు విష్ణు మాట్లాడుతూ...

‘సింగం 123' నాకు చాలా ప్రతిష్ఠాత్మక చిత్రం. ఫేవరేట్‌ ప్రాజెక్ట్‌. నా మెయిన్‌ కాన్‌సన్‌ట్రేషన్‌ దానిమీదే అన్నారు.

డైరక్టర్ ఎవరు..

డైరక్టర్ ఎవరు..

‘సింగం 123' ని అక్షిత్‌శర్మ అనే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థి దాన్ని డైరెక్ట్‌ చేయబోతున్నాడు. త్వరలోనే దాన్ని ప్రారంభించబోతున్నారు.

‘సింగం 123' ఎలా ఉంటుందంటే..

‘సింగం 123' ఎలా ఉంటుందంటే..

జేమ్స్‌బాండ్‌, హాట్‌ షాట్స్‌, ట్రూ లైస్‌ సినిమాల తరహాలో యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌. వెరీ వెరీ గ్లామరస్‌ ఫిల్మ్‌

ఇంకోటి...

ఇంకోటి...

ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు...కొబ్బరి మట్ట అనే చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు.

వైరస్ డాట్ కామ్...

వైరస్ డాట్ కామ్...

సంపూర్ణేష్ బాబు హీరోగా... వైరస్ డాట్ కామ్ అనే పేరుతో ఓ వినూత్న చిత్రం తెరకెక్కుతోంది. (బి వేర్) అనేది ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రానికి సీ.హెచ్. శివరామకృష్ణ దర్శకత్వం వహించనున్నారు.

వైరస్ లో...

వైరస్ లో...

విజయదశమి రోజున లాంఛనంగా ప్రారంభం అయిన ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ఎన్ ఫిల్మ్స్ పతాకంపై సలీం, ఎ.జె. రాంబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది.

వర్మ డైరక్షన్ లో...

వర్మ డైరక్షన్ లో...

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...సంపూర్ణేష్ బాబు ని హీరోగా పెట్టి ఓ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం టైటిల్ "పోకిరి రిటర్న్స్'.

మహేష్ మీద స్పూఫ్...

మహేష్ మీద స్పూఫ్...

ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. దాంతో ఇది మహేష్ బాబు స్పూఫ్ గా చేస్తున్న చిత్రమా అని సందేహాలు మొదలయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X