ఫస్ట్ లుక్ టీజర్: సంపూర్ణేష్ బాబు ‘సింగం 123’ (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : హృదయ కాలేయం చిత్రంతో పరిచయమైన సంపూర్ణేష్‌బాబు హీరో గా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింగం 123 టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తమ 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించనున్నారు. హోలీ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ ...పోలీస్ చిత్రాలకు స్పూఫ్ గా ఉండి అందరనీ ఆకట్టుకునేలా డిజైన్ చేసారు. ఈ క్రింద మీరు దాన్ని చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మే 15 న చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కూడా పబ్లిసిటీ వెరైటీగా చేస్తున్నారు. నాలుక మడతెట్టి సంపూర్ణేష్ బాబు ఫోటోలకు పవర్ ఫుల్ ఆటిట్యూడ్ తో ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.

మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా మంచు విష్ణు నిర్మిస్తోన్న ఈ చిత్రంలోసంపూర్ణేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.... సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది. కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు.

Sampoorenesh Babu's SINGHAM123 First Look Teaser

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఎడిటర్: యం.ఆర్.వర్మ, మ్యూజిక్: శేషు, డైలాగ్స్: డైమండ్ రత్నం, ఆర్ట్: రఘు కులకర్ణి, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత: విష్ణు మంచు, దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ.

మంచు విష్ణు మాట్లాడుతూ... ‘సింగం 123' నాకు చాలా ప్రతిష్ఠాత్మక చిత్రం. ఫేవరేట్‌ ప్రాజెక్ట్‌. నా మెయిన్‌ కాన్‌సన్‌ట్రేషన్‌ దానిమీదే. అక్షిత్‌శర్మ అనే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థి దాన్ని డైరెక్ట్‌ చేయబోతున్నాడు. త్వరలోనే దాన్ని ప్రారంభించబోతున్నాం. జేమ్స్‌బాండ్‌, హాట్‌ షాట్స్‌, ట్రూ లైస్‌ సినిమాల తరహాలో యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌. వెరీ వెరీ గ్లామరస్‌ ఫిల్మ్‌ అన్నారు మంచు విష్ణు.

ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు...కొబ్బరి మట్ట అనే చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే...సంపూర్ణేష్ బాబు హీరోగా... వైరస్ డాట్ కామ్ అనే పేరుతో ఓ వినూత్న చిత్రం తెరకెక్కుతోంది. (బి వేర్) అనేది ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రానికి సీ.హెచ్. శివరామకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. విజయదశమి రోజున లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ఎన్ ఫిల్మ్స్ పతాకంపై సలీం, ఎ.జె. రాంబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది.

కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X