twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరల్డ్ రికార్డ్ డైలాగ్ వెనుక అసలు కథను వివరించిన సంపూర్ణేశ్ బాబు

    |

    'హృదయ కాలేయం' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి బర్నింగ్ స్టార్‌గా పరిచయం అయ్యాడు సంపూర్ణేశ్ బాబు. ఈ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీతో పాటు సామాన్య ప్రజలను తన వైపునకు తిప్పుకున్నాడు. ఆకట్టుకునే అందం, సరైన ఫిజిక్ లేకపోయినా సంపూకి తెలుగు రాష్ట్రాల్లో బానే క్రేజ్ ఉంది. ఈ కారణంగానే అతడిని 'బిగ్ బాస్' రియాలిటీ షోలోకి కూడా తీసుకున్నారు. ఆ తర్వాత కూడా సంపూ 'బందిపోటు', 'పెసరట్టు' అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఇవేమీ ఆయనకు బ్రేక్ ఇవ్వలేదు.

    దీంతో మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సంపూర్ణేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. అపుడెపుడో ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌తో హడావిడి చేస్తున్న సంపూర్ణేష్ బాబు.. విడుదల మాత్రం చేయలేదు. పలుమార్లు సినిమా విడుదల తేదీలను ప్రకటించినా.. అది ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమాను ఈ నెల 10న విడుదల చేస్తామని ప్రకటించింది.

    Sampoornesh Babu about World Record dialogue

    ఇక, ఈ మధ్య ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి సంపూ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. తాజాగా విడుదలైన ఆండ్రాయిడు పరిచయ ట్రైలర్‌లో 3.27 నిమిషాల నిడివితో నాన్ స్టాప్ డైలాగ్ ఉంది. ఈ డైలాగును సంపూర్ణేష్ బాబు సింగిల్ టేక్‌లో చెప్పారట. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ సంపూర్ణేష్‌ను ఆండ్రాయిడ్‌గా పరిచయం చేస్తూ ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి విశేష స్పందన వచ్చింది. దీంతో సినిమాపై ఆసక్తి కూడా పెరిగిపోయింది.

    ఈ నేపథ్యంలో ఆయన ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వరల్డ్ రికార్డ్ డైలాగ్ వెనకున్న కథను చెప్పారు. 'ఈ సినిమాలోనే ఆడవాళ్ల మీద ఒక డైలాగ్ చెప్పాను. అది గతంలోనే విడుదల చేశాం. దానికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు దానికి మించింది పెట్టాలనుకున్నాం. అయితే, మగవాళ్ల మీద కూడా డైలాగ్ అనుకున్నాం కానీ, తర్వాత ఎందుకో బాగోదు అనిపించింది. దీంతో రాజేష్ అన్న (స్టీవెన్ శంకర్) ఈ డైలాగ్ రాశాడు. ఇది దాదాపు పది రోజుల పాటు ప్రాక్టీస్ చేశాను. చిన్న పిల్లలు హోం వర్క్ చేసినట్లు బట్టీ బట్టాను. అలాగే సినిమాలో చెప్పేశాను. దీనికి వస్తున్న రెస్పాన్స్ చూస్తే సినిమా హిట్ అయినంత సంతోషంగా ఉంది' అని సంపూ చెప్పుకొచ్చారు.

    English summary
    Burning star Sampoornesh Babu.. One Of The Hero In Telugu Film Industry. He Is Very Famous with His First Film Hrudaya Kaleyam. This Movie Create Sensation In Tollywood. Now He acted Movie kobbari matta.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X