సంపూర్ణేష్ బాబుకు కారు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో సంపూర్ణేష్ బాబుతో పాటు ఆయన భార్య, పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో అందరికీ స్వల్పంగా గాయాలయ్యాయని తెలిసింది. పూర్తి వివరాల్లోకి పోతే..

 తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట పట్టణంలో ప్రమాదం

తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట పట్టణంలో ప్రమాదం

తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం (నవంబర్ 27) ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. సంపూర్ణేష్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టడంతో

ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టడంతో

ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టడం చూసిన స్థానికులు వెంటనే కారు వద్దకు వెళ్లి చూడగా అందులో సంపూర్ణేష్ బాబు కనిపించారు. దీంతో స్థానికుల సహకారంతో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ప్రమాదం విషయమై స్థానికులు పోలీసులకు స‌మాచారం అందించడంతో సిద్ధిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.

సంపూర్ణేశ్ బాబు కారు ధ్వంసం.. రంగంలోకి పోలీసులు

సంపూర్ణేశ్ బాబు కారు ధ్వంసం.. రంగంలోకి పోలీసులు

ఈ ప్రమాదంలో సంపూర్ణేశ్ బాబు కారు స్వల్పంగా ధ్వంసమైంది. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్టీసీ విషయమై తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, తాత్కాలిక డ్రైవర్ల పోకడపై మండిపడుతున్నారు జనం.

Recommended Video

#CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
తాత్కాలిక డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు.. ప్రజల్లో ఆందోళన

తాత్కాలిక డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు.. ప్రజల్లో ఆందోళన

నిన్న (మంగళవారం) రోజు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మరణం పాలైంది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడపడంపై ఆందోళన చెందుతున్నారు తెలంగాణ ప్రజలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X