షకీలా గుడ్ అని చెప్పలేను.. ఆయన ఏది చెబితే అది చేసేస్తుంది: సంపూర్ణేశ్ బాబు

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఈ చిత్రంతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కుస్తీ పడుతూనే ఉన్నారు. అపుడెపుడో ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌తో హడావిడి చేస్తున్న సంపూర్ణేష్ బాబు.. విడుదల మాత్రం చేయలేదు. పలుమార్లు సినిమా విడుదల తేదీలను ప్రకటించినా.. అది ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమాను ఈ నెల 10న విడుదల చేస్తామని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది యూనిట్. ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి సంపూ రికార్డ్ నెలకొల్పిన డైలాగ్‌ను ఆండ్రాయిడు పరిచయ ట్రైలర్‌లో చూపించారు. ఇది 3.27 నిమిషాల నిడివితో ఉంది. ఈ డైలాగుకు భారీ రెస్పాన్స్ వచ్చింది.

Sampoornesh Babu comments on shakeela

అలాగే ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో షకీలా గురించి సంపూర్ణేశ్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ''అంతకు ముందు షకీలా గారిని ఎప్పుడూ కలవలేదు. మామూలుగా ఆమెను చూసే విధానం వేరు.. ఆమె మీద ఉన్న అభిప్రాయం వేరు. కానీ, షకీలా గారు ఎంత మంచిది అనేది మాకు తెలుసు. ఎంతో మంచి ఆర్టిస్టు'' అని చెప్పుకొచ్చాడు.

అలాగే, ''షకీలా గారు ఎంతో కన్వినెంట్‌గా ఉంటది. డైరెక్టర్ ఏది చెప్పినా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆమెతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆమెను దగ్గరుండి చూశాను కాబట్టి ఇదంతా చెబుతున్నాను. ఆమె గుడ్ అని మాత్రం చెప్పలేను. కానీ, అందరికీ తెలిసిన షకీలా గారు వేరు.. మాకు తెలిసిన షకీలా గారు వేరు'' అని సంపూ వివరించాడు. అన్నట్లు ఈ సినిమాలో షకీలా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె భర్తగా ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X