twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొబ్బరిమట్ట రిలీజ్ కాదన్నారు.. నమ్మిన వాళ్లే మోసం.. సినిమాలో కనిపించను.. సంపూ ఉద్వేగం

    |

    హృదయకాలేయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న సంపూ ఉరఫ్ సంపూర్ణేష్ బాబు మళ్లీ కొబ్బరిమట్ట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఎమోషనల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన గురువు రాజమౌళిగారికి, వెనకుండి తండ్రిలాగా నడిపించిన రాజేశ్ అన్నకు, ఏమీ తెలియనప్పుడు మా వెనుక ఉండి అండగా నిలిచిన సందీప్ కిషన్, మారుతి గారికి, చాలా మంది హీరోల అభిమానులకు ధన్యవాదాలు. మా సినిమా ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ మేము నమ్మిన వాళ్లే వెన్ను పొడిచారు అని సంపూర్ణేష్ బాబు ఉద్వేగంగా ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

    కొబ్బరిమట్ట మూవీ రిలీజ్ కాదని

    కొబ్బరిమట్ట మూవీ రిలీజ్ కాదని

    కొబ్బరిమట్ట సినిమా రిలీజ్ కాదు. ఇక మీరు ఈ సినిమా చేయలేరు. ఎందుకు నిర్మాత సాయి రాజేష్‌తో ఉంటున్నావు. వేరే సినిమాలు ఒప్పుకో అని నా సన్నిహితులే నాతో అన్నారు. నా స్నేహితులు, సన్నిహితుల చెప్పిన విషయాలు నిర్మాత రాజేష్‌కు చెప్పుకోలేకపోయాను. ఈ విషయాన్ని సాయి రాజేష్‌కు నా స్నేహతులు చెప్పి ఉంటారు. ఇప్పటికీ ఆ విషయాన్ని చెప్పుకోలేదు అని సంపూ అన్నారు.

     ఆఫర్లు వదులుకోవాలా? లేదా

    ఆఫర్లు వదులుకోవాలా? లేదా

    నేను నటించిన ఈ సినిమాలో స్టెప్పులు వేయడానికి, డైలాగులు చెప్పడానికి ఎప్పుడు కష్టపడలేదు, బాధకలుగలేదు. ఒకరోజు కాకపోతే రెండు రోజులు సమయం తీసుకొన్నాం. మా వెల్‌విషర్స్, మేము బాగా నమ్మిన వాళ్లు మాతో ఆడిన నాటకాలే బాగా ఇబ్బంది కలిగింది. డబ్బుల్లేక ఇబ్బంది పడ్డాం. వారి మాటలతో ఇతర ఆఫర్లు వదులుకోవాలా? లేదా కొబ్బరి మట్ట పూర్తి చేయాలా అనే సందేహాలు నన్ను వెంటాడాయి అని సంపూ ఆవేదన వ్యక్తం చేశారు.

    ప్రతీసారి ప్రేక్షకులే నిలబెట్టారని

    ప్రతీసారి ప్రేక్షకులే నిలబెట్టారని

    నిర్మాత సాయి రాజేష్‌కు ఒకటే మాట చెప్పాలనుకొంటున్నాను. మనం చేసే ప్రతీ ప్రయత్నానికి ఆదరించింది ప్రేక్షకులే. మనం నిరుత్సాహ పడిన ప్రతీసారి మనల్ని నిలబెట్టింది ప్రేక్షకులే. మనం ఎవరో తెలియని సమయంలో మనకు అండగా ఉన్నారు. శంభోశంకర, అఆఇఈ పాటలు విడుదల చేసినప్పుడు.. సినిమాకు బ్రహ్మాస్త్రం లాంటి మూడున్నర నిమిషాల డైలాగ్స్ చెప్పినప్పుడు ప్రేక్షకుల స్పందన అనూహ్యం. అంతకంటే మీకు ఏం కావాలి అని సంపూ ఉద్వేగంగా ప్రసంగించారు.

     ఇక సినిమాలో కనిపించనని

    ఇక సినిమాలో కనిపించనని

    కొబ్బరి మట్ట సినిమా అందరిని ఆకట్టుకొంటుంది. ప్రతీ ఒక్కరిని నవ్విస్తుంది. నేను నవ్వించకపోతే ఇక సినిమాలే చేయను. వందశాతం మిమ్మల్ని ఉత్సాహ పరుస్తుంది. ఇన్ని రోజుల నా బాధను చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మాకు వెన్నెముకగా నిలిచిన సందీప్ కిషన్‌ రుణపడి ఉంటాం. నా మాదిరిగా కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు మీరు అండగా నిలబడాలి అని సంపూ అన్నారు.

    English summary
    Sampoornesh Babu's Kobbari Matta rights sold for fancy price. This movie is set release on August 10th. Directed by Roopak Ronaldson, Produced by Sai Rajesh Neelam, Story, Screen Play by Steven Sankar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X