twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదం రేపిన సీన్.. సంపూర్ణేశ్ బాబుకు క్షమాపణ చెప్పిన ‘RX100’ హీరో

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినియాలకు, పలు పాత్రలకు స్ఫూఫ్‌లు వస్తూ ఉంటాయి. వాటిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కారణంతోనే ఫిల్మ్ మేకర్లు స్ఫూఫ్స్‌ను ఎక్కువగా చూపించడానికి ఆసక్తి చూపుతుంటారు. వీటినే ప్రధానంగా తీసుకుని అల్లరి నరేష్ 'సుడిగాడు' సహా పలు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటిదే ఓ సినిమాలో కనిపించింది. అయితే, అది రిలీజ్ కాని సినిమా కావడం విశేషం. ఈ పరిణామంతో చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. వెంటనే సదరు సినిమా యూనిట్‌పై విరుచుకు పడింది.

    'RX100' హీరో కార్తికేయ కొద్దిరోజుల క్రితం 'హిప్పీ' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైంది. ఇందులో చూపించిన ఒక సీన్ ఇప్పుడు వివాదాస్పదమైంది. అదేమిటంటే.. 'హిప్పీ'లో సంపూర్ణేశ్ బాబు నటించిన 'కొబ్బరిమట్ట'కు సంబంధించిన సీన్ చూపించారు. దీనిపై చిత్ర యూనిట్ గుర్రుగా ఉంది. వెంటనే దీనిపై సంపూర్ణేశ్ బాబు 'రిలీజ్ కాని సినిమా సీన్లను వాడుకోవడం ఏమిటి' అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.

    Sampoornesh Babu Fire On RX100 hero

    దీనిపై చిత్ర హీరో కార్తికేయ స్పందించాడు. సంపూ చేసిన ట్వీట్‌కు ''సంపూర్ణేశ్‌ బాబు అన్నా... నన్ను క్షమించండి. మా టీమ్‌తో పాటు నా తరపున మీకు సారీ. నిజంగా మీరు నటించిన 'కొబ్బరిమట్ట' విడుదల కాలేదనే విషయం నాకు తెలియదు. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. మీ మొదటి సినిమా 'హృదయ కాలేయం' చూశాను. ఈ సినిమాను నేను చాలా ఎంజాయ్‌ చేశా. అలాగే 'కొబ్బరిమట్ట' పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా'' అని రిప్లై ఇచ్చాడు. ఆయన క్షమాపణలు చెప్పడంతో సంపూర్ణేశ్‌ ట్వీట్ డిలీట్‌ చేశాడు.

    'కొబ్బరిమట్ట' చిత్రంతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కుస్తీ పడుతూనే ఉన్నారు. అపుడెపుడో ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌తో హడావిడి చేస్తున్న సంపూర్ణేష్ బాబు.. విడుదల మాత్రం చేయలేదు. పలుమార్లు సినిమా విడుదల తేదీలను ప్రకటించినా.. అది ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తుందో చెప్పడం కష్టంగా మారింది.

    English summary
    Burning star Sampoornesh Babu.. One Of The Hero In Telugu Film Industry. He Is Very Famous with His First Film Hrudaya Kaleyam. This Movie Create Sensation In Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X