సంపూర్ణేష్ బాబు ‘హృదయ కాలేయం’(ఫోటోలు)
హైదరాబాద్: చూడడానికి కమెడియన్ లా ఉండే పర్సనాలిటీ. చెప్పేవి స్టార్ హీరో డైలాగులు. మాస్ మసాలా తెలుగు సినిమాలను, స్టార్ హీరో పవర్ఫుల్ డైలాగులను ఒకే ఒక్క టీజర్ తో కామెడీ చేసిపారేశాడు. హీరోగా సినిమా స్టార్ట్ చేయక ముందే తనకో బిరుదు ఇచ్చేసుకున్నాడు. 'హృదయ కాలేయం' చిత్రం ద్వారా ఇంటర్నెట్లో ఇన్ స్టంట్ ఫేం పొందాడు 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేష్ బాబు.
ముక్క మొహం తెలియని సంపూర్ణేష్ బాబు ఇంతలా పాపులర్ కావడం వెనక ఉన్నది ఓ అసిస్టెంట్ డైరెక్టర్. అతడే స్టీవెన్ శంకర్. అసిస్టెంట్ దర్శకుడిగా పలు చిత్రాలకు పని చేసిన అతను తన వెరైటీ ఆలోచనలతో 'హృదయ కాలేయం' చిత్రానికి రూపకల్పన చేసాడు. తన ఆలోచనలను టీజర్ రూపంలో ఇంటర్నెట్లో వదిలాడు. కొంతగా, వింతగా, వెటకారంగా ఉండటంతో అందరికీ నచ్చింది.
ఇప్పుడు మాగ్జిమమ్ తెలుగు సినిమా ప్రేక్షకుల్లో సంపూర్ణేష్ బాబు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి.

సంపూర్ణేష్ బాబు
సంపూర్ణేష్ బాబు సినిమా ఫ్యామిలీ నుండి రాలేదు, అతని మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, హీరోలో ఉండాల్సిన క్వాలిటీ ఒక్కటీ అతనిలో లేదు, కానీ ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రేక్షకుల దృష్టినే కాదు....టాలీవుడ్ ప్రముఖుల దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.

హృదయ కాలేయం
విచిత్రంగా ‘ఎ కిడ్నీ విత్ హార్ట్' అనే సబ్ టైటిల్‌తో ‘హృదయ కాలేయం' చిత్రం హీరో సంపూర్ణేష్ బాబు తనదైన రీతిలో సినిమాకు ప్రచారం కల్పిస్తూ...తొలి సినిమాతోనే ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకున్నాడు.

కాన్సెప్టు ఏమిటి?
ఈ సినిమా కాన్సెప్టు విషయానికిస్తే.....చెత్త ఫిల్మ్ మేకింగ్ అంటే ఎలా ఉంటుంది అనే కోణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారని తెలుస్తోంది.

ఇంట్రడక్షన్ సాంగ్
సినిమా ప్రచారం కోసం ట్రైలర్ రూపంలో ‘నేనే సంపూ ... ముద్దు పేరే తెగింపు' అనే సాంగ్‌ని కూడా వదిలాడు సంపూ. సినిమాలో ఇదే ఇంట్రడక్షన్ సాంగ్ కాబోలు.

గుడ్ సినిమా గ్రూపు సమర్పణలో
వినూత్నమైన పబ్లిసిటీతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేపథ్యంలో.....‘ఈ రోజుల్లో', విల్లా(పిజ్జా 2) చిత్రాలను విడుదల చేసిన ‘గుడ్ సినిమా గ్రూపు' వారు తమ సంస్థ సమర్పణలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టీవెన్ శంకర్ దర్శకుడు. నీలం సాయి రాజేష్ నిర్మాత. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ..
సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ...‘హదయ కాలేయం'...ఎ కిడ్నీ విత్ హార్ట్ టైటిల్ ఎందుకు పెట్టానో సినిమా చూసాక తెలుస్తుంది. తొలుత నేను అనుకున్న కథ తీయడానికి నిర్మాతలు ఎవరూ రాలేదు. ఇంటర్నెట్లో ట్రైలర్స్ పాపులర్ అయ్యాకే కొంత మంది ముందుకు వచ్చారు. ఈ కథ ఎవరూ చేయడానికి ఇష్టపడలేదు. ఓ ఫంక్షన్లో పరిచయమైన సంపూర్ణేష్ బాబు తనంతట తానుగా...మీరెలా చేయమన్నా చేయడానికి సిద్ధమని ముందుకు వచ్చాడు, సినిమా వైరైటీగా ఉంటుంది అని దర్శకుడు తెలిపారు.


Click it and Unblock the Notifications











