మారుతి ‘కొత్తజంట’లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు
హైదరాబాద్: సంపూర్ణేష్ బాబు గురించి నెటిజన్లకు కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. 'హృదయకాలేయం' టీజర్లతో యూట్యూబులో, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అందరి దృష్టిని ఆకర్షించిన సంపూ.... తనకు తానుగానే 'బర్నింగ్ స్టార్' అనే బిరుగు తగిలించుకుని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
సంపూర్ణేష్ బాబు మొదటి సినిమా 'హృదయ కాలేయం' ఇంకా విడుదల కానేలేదు...అప్పుడే మరో సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. అల్లు శిరీష్-రెజీనా జంటగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న 'కొత్త జంట' చిత్రంలో సంపూర్ణేష్ బాబు కూడా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ముఖ్యమైన పాత్రలో చేస్తున్నాడట.
శ్రీను వైట్ల సినిమాల్లో బ్రహ్మానందం పాత్ర సినిమాకు ఎంత కీలకంగా ఉంటుందో....మారుతి 'కొత్త జంట' చిత్రంలో సంపూర్ణేష్ బాబు పాత్ర కూడా అదే తరహాలో ఎంతో కీలకంగా ఉండనుందని సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
గీతాఆర్ట్స్ బ్యానర్ లో మారుతి తెరకెక్కిస్తున్న సినిమా 'కొత్తజంట'. ఇందులో అల్లు శిరీష్, రెజీనా జంటగా నటిస్తున్నారు. బన్నీవాసు నిర్మాత. తొలి చిత్రం గౌరవం తర్వాత అల్లుశిరీష్ నటిస్తున్న సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. జె.బి.సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications












