»   » పవన్, నాగార్జున దారిలో బర్నింగ్ స్టార్!

పవన్, నాగార్జున దారిలో బర్నింగ్ స్టార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sampoornesh Babu to meet Narendra Modi!
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్స్ అంతా వరుస పెట్టి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసి తమ మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాగార్జున లాంటి టాప్ స్టార్లు స్వయంగా గుజరాత్ వెళ్లి మెడీని కలిసారు. ఆయనే ప్రధాని కావాల్సిన అవసరం ఉందంటూ జై కొట్టారు.

ఇపుడు మరో టాలీవుడ్ హీరో కూడా మోడీని కలవబోతున్నాడు. అతనెవరో కాదు....బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఈ విషయాన్ని సంపూర్ణేష్ బాబు స్వయంగా వెల్లడించారు. మరో మూడు రోజుల్లో మోడీని కలవబోతున్నానని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు.

అయితే ఇది పబ్లిసిటీ స్టంటే అని స్పష్ట మవుతోంది. కేవలం తన 'హృదయ కాలేయం' చిత్రానికి పబ్లిసిటీ తేవడానికే సంపూర్ణేష్ బాబు నరేంద్రమోడీని వాడుకుంటున్నాడని అంటున్నారు. సంపూర్ణేష్ లాంటి వారికి మోడీ అపాయింట్ మెంట్ దొరికే అవకాశమే లేదని అంటున్నారు. మొత్తానికి సినిమా జనాలను బురిడీ కొట్టించడానికి బానే ట్రై చేస్తున్నావు సంపూర్ణేష్ బాబూ..! కొందరు సెటైర్లు వేస్తున్నారు.

హృదయ కాలేయం సినిమా విషయానికొస్తే...సెన్సార్ సహా నిర్మాణ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. అమృత క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో స్టీవెన్ శంకర్ నిర్మించిన ఈ చిత్రంలో కావ్య కుమార్, ఇషికాసింగ్ హీరోయిన్స్.

English summary
It seems whole Tollywood is joining the list to meet Narendra Modi. It’s now the news about burning star Sampoornesh Babu meeting Modi. This news was announced by the hero it self on a social networking site.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu