సీఎంను కలిసి చెక్కు అందించిన సంపూర్ణేష్ బాబు
హైదరాబాద్: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హుధూద్ తుఫాన్ సీఎం సహాయ నిధికి రూ. 1 లక్ష విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సంపూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిసి చెక్కు అందజేసారు. ఆయనతో పాటు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, హృదయ కాలేయం డైరెక్టర్ సాయి రాజేష్, లైన్ ప్రొడ్యూసర్ అనురాగ్ కూడా చంద్రబాబును కలిసారు. ఈ సందర్భంగా సంపూర్నేష్ బాబును చంద్రబాబు అభినందించారు.
అతి తక్కువ కాలంలోనే సినిమా రంగంలో సెన్సేషన్ సృష్టించడంతో పాటు....పేరుప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సంపూర్ణేష్ బాబు సేవా కార్యక్రమాల్లో కూడా ముందు ఉండటం అభినందించదగ్గ విషయమని అన్నారు. ప్రతి ఒక్కరూ తుఫాను బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని సీఎం కోరారు.



Click it and Unblock the Notifications











