పవర్ స్టార్‌ను కలిసిన సంపూ, టైమింగ్ అదుర్స్.... పదేళ్లు ఆ కిక్ అలాగే!

By Bojja Kumar

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పర్‌ఫెక్ట్ టైమ్ చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలిశారు. తెలంగాణ నుండి పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర మొదలు పెట్టిన సందర్భంగా సంపూర్ణేష్ బాబు వెళ్లి ఆయనకు తన మద్దతు తెలిపారు. ఆయనతో దిగిన ఫోటోను సంపూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఫైనల్ గా లిడర్‌ని కలిశా

ఫైనల్ గా లిడర్‌ని కలిశా

ఫైనల్ గా లిడర్‌ని కలిశాను..మీ మాటలు స్ఫూర్తిదాయకం. మీ బాటలోనే మేము.. జై హింద్ అంటూ సంపూర్ణేష్ బాబు చేసిన పోస్టు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

టైమింగ్ అదుర్స్

టైమింగ్ అదుర్స్

పవర్ స్టార్‌ను సంపూర్ణేష్ బాబు సరైన సమయంలో కలిశారని, టైమింగ్ అదిరిపోయిందని అభిమానులు అంటున్నారు. ఇది ఎవరూ మరిచిపోలేని టైమింగ్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంతకాలం కావాలనే కలవలేదు

ఇంతకాలం కావాలనే కలవలేదు

కొన్ని రోజుల క్రితం సంపూర్ణేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... నేను ఇంత వరకు ఇండస్ట్రీలో చాలా మందిని కలిశాను. కానీ పవన్ కళ్యాణ్‌ను కలవలేదు. మనోజ్ అన్న పెళ్లికి వచ్చినపుడు ఆయన నుండి దూరంగా వెళ్లిపోయి అలా చూస్తూ ఉండిపోయాను. తర్వాత ఈటీవీ ఫంక్షన్‌కు వచ్చినపుడు కూడా కలవలేదు. తర్వాత ‘కాటమరాయుడు' షూటింగ్ జరుగుతున్న సమయంలో వెళ్లాను. బ్రేక్‌లో పవన్ కళ్యాణ్ గారు అలా కూర్చుని ఉండిపోయారు. దూరం నుండే ఓ 20 నిమిషాలు అలా చూసి వచ్చేశాను. కావాలనే కలవలేదు.... అని సంపూ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఓ పదేళ్లు అలాగే ఉండి పోవాలి

ఓ పదేళ్లు అలాగే ఉండి పోవాలి

హృదయ కాలేయం ఇచ్చిన కిక్కు నాలో ఇంకా ఉంది. అదే విధంగా బిగ్ బాస్ తర్వాత కూడా మంచి కిక్కు వచ్చింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఆ కిక్కు ఓ పదేళ్లు అలాగే ఉండి పోవాలి. అందుకే మంచి సమయం కోసం చూస్తున్నాను... అని సంపూర్ణేష్ బాబు అన్నారు. ఆయన అన్నట్లుగా మంచి సమయం చూసి పవర్ స్టార్ ను కలిశారు.

బండ్ల గణేష్ ట్వీట్

పవర్ స్టార్ పవర్ అంటే ఇదీ అంటూ.... పవన్ కళ్యాణ్ తెలంగాణ యాత్రకు సంబంధించిన ఫోటో పోస్టు చేసిన బండ్ల గణేష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X