సంపూర్ణేష్ బాబు తో కలిసి నటించాలని ఉందా?డిటేల్స్

By Srikanya

హైదరాబాద్ : హృదయ కాలేయం చిత్రంతో ప రిచయమైన సంపూర్ణేష్‌బాబు హీరో గా వైరస్ డాట్ కామ్ అనే పేరుతో ఓ వినూత్న చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. (బి వేర్) అనేది ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రం కోసం స్టార్ హంట్ నిర్వహించాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. అక్టోబర్ నుంచి మొదలయ్యే ఈ చిత్రంలో నటించాలనే ఆసక్తి ఉన్న...మేల్, ఫిమేల్ ఆర్టిస్టులు(18 నుంచి 28 లోపు) ఎవరైనా ఈ క్రింద ఇచ్చిన ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చు ...అలాగే ఈ క్రింద ఇచ్చిన మెయిల్ ఐడి కి ఫొటోలు పంపవచ్చు. సెప్టెంబర్ 20 లోపు ఇదంతా జరగాలి.

సెల్ నెంబర్: 9618720950,
మెయిల్ ఐడీ: [email protected]

Sampoornesh Babu Movie Star Hunt

ఈఇ చిత్రానికి సీ.హెచ్. శివరామకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. విజయదశమి రోజున లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ఎన్ ఫిల్మ్స్ పతాకంపై సలీం, ఎ.జె. రాంబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది.

కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X